దీపిక టాటూ లో ఉన్న అర్ధం అదేనా ....!!

murali krishna
బాలీవుడ్ బ్యూటీ ఐనా దీపికా పదుకొణెకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాన్ ఇండియాల్లో కాదు.ప్రపంచవ్యా్ప్తంగా ఈ ముద్దుగుమ్మకు ఫాలోయింగ్ భారీగానే ఉంది.
ఇటీవల అమెరికాలోని లాస్ ఏంజిల్స్ వేదికగా జరిగిన ఆస్కార్ అవార్డ్స్ వేడుకలలో బ్లాక్ డ్రెస్‏లో మెరిసింది. ఆర్ఆర్ఆర్ ‏లోని నాటు నాటు పాటను ప్రేక్షకులకు పరిచయం చేయడానికి వ్యాఖ్యతగా వేదికపైకి వచ్చింది. వెల్వెట్ గ్లోవ్స్, డైమండ్ నెక్లెస ధరించి మరింత అందంగా కనిపించింది. దీంతో అందరి చూపి దీపికాపైనే ఉన్నాయి. ఆమెకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. అయితే దీపికా మెడపై ఉన్న టాటూ స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది.
ఆమె చెవికి దిగువన అతని మెడపై '82°E' అనే టాటూ కనిపించింది. దీంతో '82°E అంటే ఏమిటీ ? అని ఆరాలు తీస్తున్నారు నెటిజన్స్. '82°E అంటే దీపికా కొత్తగా మొదలుపెట్టిన స్క్రీన్ కేర్ బ్రాండ్. ఇటీవల ఆమె జిగర్ షా అనే స్క్రీన్ కేర్ బ్రాండ్ స్థాపించిన సంగతి తెలిసిందే. గతేడాది నవంబర్ నుంచి ఈ బ్రాండ్ నుంచి చర్మ సంరక్షణ ఉత్పత్తులు మార్కెట్లోకి రావడం ప్రారంభించాయి. అలా తన సొంత బ్రాండ్ ను దీపికా మెడ పై టాటూల వేసుకోవడం చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.
ఆస్కార్ వేడుకలలో భారత్ నుంచి దీపికా స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. దీంతో ఆమెపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు. దేశం మొత్తాన్ని ఒక్క తాటిపైకి తీసుకువచ్చి ఇంత ప్రతిష్టాత్మకమైన వేదిక పై నిలవడం అంత సులభం కాదంటూ దీపిక ను పొగడ్తలతో ముంచేత్తింది బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.
ఐనా రాజమౌళి గారు ఈ ఈవెంట్ కు దీపిక ను సెలెక్ట్ చేయడాని కి కారణం ఏంటనేది ఇంకా అంతు చిక్కని ప్రశ్న గా మారింది. దీని వెనకాల ఏమైనా అంతరార్ధం ఉందా!అని నేటిజన్లు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: