రాజమౌళి అక్కడ న్యూ హౌస్ కొనడానికి కారణం అదేనా.....!!

murali krishna
ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు ప్రపంచ స్థాయి లో ఇపుడు వినబడుతున్న డైరెక్టర్ పేరు రాజమౌళి. ఆయన ఏం చేసినా సరే ఓ పద్ధతి, ప్లానింగ్, విజన్ పక్కాగా ఉంటుంది. ఫస్ట్ మూవీ 'స్టూడెంట్ నం.1' నుంచి ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' వరకు ప్రతి మూవీ విషయంలో పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్లాడు.
అన్ని సినిమాలతో హిట్స్, సూపర్ హిట్స్ కొట్టాడు. సినిమాల సంగతేమో గానీ ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి మార్కెట్, క్రేజ్ చాలా పెరిగిపోయింది. ఫస్ట్ పార్ట్ తో పాన్ ఇండియా వైడ్.. సీక్వెల్ తో వరల్డ్ వైడ్ ఫేమస్ అయిపోయాడు. ‘ఆర్ఆర్ఆర్’కు తాజాగా ఆస్కార్ రావడం రాజమౌళి రేంజునే పెంచేసింది. దీంతో ఇప్పుడు ఏకంగా అమెరికాలో ఓ ఇల్లు కూడా తీసేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఐతే ఇక అసలు విషయానికొస్తే డైరెక్టర్ రాజమౌళి పేరు చెబితే తెలుగు ప్రేక్షకులు ఒళ్లు పులకరిస్తుంది. ఎందుకంటే పక్కా కమర్షియల్ సినిమాలే తీస్తాడు గానీ ప్రేక్షకుల పల్స్ మాత్రం కరెక్ట్ గా పట్టుకుంటాడు. సినిమాలో ఏ సీన్ ఎక్కడ పడితే ఆడియెన్స్ కనెక్ట్ అవుతారో రాజమౌళికి తెలిసినంతగా మరే డైరెక్టర్ కి తెలియదేమో. అలా ఇప్పటివరకు 12 మూవీస్ తీస్తే అవన్నీ కూడా ఇండస్ట్రీ రూపురేఖల్ని మార్చేశాయి. అయితే తెలుగుతోపాటు ఇండియా వైడ్ ప్రేక్షకుల్ని అలరించిన రాజమౌళి దృష్టి ఇప్పుడు హాలీవుడ్ పై పడింది. అందులో భాగంగానే లాస్ ఏంజెల్స్ లో ఓ అద్దె ఇల్లు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఆస్కార్ నామినేషన్స్, అవార్డు అందుకోవడంలో భాగంగా అమెరికాకు చాలాసార్లు వెళ్లి వచ్చిన రాజమౌళి.. పలు హాలీవుడ్ నిర్మాణ సంస్థలతోనూ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అలానే తన తర్వాత సినిమా మహేష్ బాబుతో తీయనున్నాడు. ఇందుకోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ తో కలిసి పనిచేయనున్నాడు. ఇలా ప్రతిసారి హోటల్స్ లో ఉండాలంటే కష్టమవుతుందని ఏమో అని రాజమౌళి.. ఓ రెంటెడ్ హౌస్ ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’కు ఆస్కార్ వచ్చిన తర్వాత సెలబ్రేషన్స్ ఆ ఇంట్లోనే జరుపుకున్నారని సమాచారం. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకునే ఈ ప్లానింగ్ అంతా జక్కన్న చేసినట్లు అనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: