అంచలంచలుగా ఎదిగిన రాజమౌళి..!!

Divya
టాలీవుడ్ లో దిగ్గజ ధీరుడు గా పేరు పొందిన రాజమౌళితో సినిమా అంటే ఏ హీరో కూడా నో చెప్పారు. ఎందుకంటే రాజమౌళి తో సినిమా చేశారంటే చాలు ఆ సినిమాలో నటించిన నటీనటులకు సైతం మంచి క్రేజీ ఉంటుందని చెప్పవచ్చు. ఇక రాజమౌళి కెరియర్ల తను తెరకెక్కించిన సినిమాలలో ప్రతి సినిమాలో కూడా ఒక వైవిధ్యం ఉన్నదని చెప్పవచ్చు. అలా రాజమౌళి కొత్తదనంగా చూపించడం కోసం ఎన్నోసార్లు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

రాజమౌళి మగధీర సినిమాతో గ్రాండ్ సోఫియా ఫాంటసీని ప్రయత్నించడం జరిగింది. బాగానే సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత ఈగ వంటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి స్టార్ హీరోలు కూడా అవసరం లేదనే విషయాన్ని నిరూపించడం జరిగింది. ఇక తర్వాత ప్రభాస్, రానా లతో కలిసి బాహుబలి, బాహుబలి-2 వంటి పాన్ ఇండియా సినిమాలను పరిచయం చేయడం జరిగింది. rrr చిత్రంతో భారతీయ సినిమాను ప్రపంచానికి పరిచయం చేశారు రాజమౌళి. అంతేకాకుండా ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులను కూడా సొంతం చేసుకోవడం జరిగింది. ఇక కచ్చితంగా రాజమౌళి మహేష్ తో తెరకెక్కిస్తున్న SSMB -29 చిత్రానికి కూడా ఊహించలేని విధంగా ప్లాన్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
రాజమౌళి కథ ఎంపిక విషయంలో ఎన్నో రకాలుగా ఆలోచించిన తర్వాతే తగు నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. మహేష్ సినిమా పైన అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో తెలియాలి అంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే. ఇప్పటికీ ఈ సినిమాకి నుంచి మంచి బజ్ ఏర్పడింది. ఏది ఏమైనా డైరెక్టర్ రాజమౌళి లాగా మరో డైరెక్టర్ కూడా రాలేరని చెప్పవచ్చు. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయబోతున్నారు ఈ సినిమా అయిపోయిన వెంటనే రాజమౌళితో సినిమా షూటింగ్ కి సిద్ధంగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: