ఏంటి.. రాజమౌళి రిటైర్ అవుతాడా.. జాతకంలో ఏముందంటే?

praveen
టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి పేరు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎంతలా మారుమోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక రాజమౌళి నుంచి సినిమా వస్తుందని టాలీవుడ్ ప్రేక్షకులు మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు అందరూ కూడా వేయికళ్లతో ఎదురుచూస్తూ ఉన్నారు. ఇక జక్కన్న తెరకెక్కించిన సినిమాలో అటు భారీ విజయాలను సాధించి నిర్మాతలకు కళ్ళు చెదిరే లాభాలను తెచ్చిపెడుతున్నాయి అని చెప్పాలి. ఇక ఒక్కసారి రాజమౌళితో సినిమా తీస్తే లైఫ్ సెటిల్ అయిపోతుందని ఎంతో మంది నిర్మాతలు కూడా భావిస్తూ ఉన్నారు.

 ఇప్పటికే బాహుబలి, త్రిబుల్ ఆర్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా రికార్డులు కొల్లగొట్టిన రాజమౌళి ఇక ఇప్పుడు మహేష్ తో సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా కూడా రికార్డులు తిరగ రాయడం ఖాయమని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అని చెప్పాలి. అయితే జక్కన్న జాతకం మాత్రం మరో విధంగా ఉండబోతుందని ప్రముఖ జ్యోతిష్యుడు చెబుతూ ఉండడం గమనార్హం. జక్కన్న జాతకం గురించి ఒక జ్యోతిష్యుడు చెప్పిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. అంతేకాదు జక్కన్న అభిమానులను తెగ టెన్షన్ పెట్టేస్తున్నాయి అని చెప్పాలి.

 ప్రస్తుతం తన సినిమాల సక్సెస్ తో ఆనందంలో మునిగిపోయిన రాజమౌళి మరి కొన్ని రోజుల్లోనే రిటైర్మెంట్ ప్రకటిస్తారని ఓ జ్యోతిష్యుడు చెప్పాడు. రాజమౌళి జ్ఞానానికి సంబంధించి ఒక సినిమా చేస్తారని.. ఆ సినిమా దీర్ఘకాలికంగా కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. ఏడేళ్ల పాటు ఒక సినిమానే పట్టుకుని రాజమౌళి ఉంటాడని.. ఆ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ను చూస్తే సీనియర్ ఎన్టీఆర్ ను చూస్తున్న భావన కలుగుతుందంటూ జ్యోతిష్యుడు చెప్పుకొచ్చాడు అని చెప్పాలి.  జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే రాజకీయాల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక చరణ్ జాతకం కూడా బాగుందని రాబోయే రోజుల్లో మరిన్ని హిట్లు కొడతాడు అంటూ తెలిపాడు. అయితే ఇలా జ్యోతిష్యులు చెప్పిన మాటలు నిజమవుతాయో లేదో తెలియదు కానీ.. జక్కన్న అభిమానుల్లో మాత్రం టెన్షన్ పెంచేశాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: