ఈవారం "ఓటిటి" ప్లాట్ ఫామ్ లో విడుదల కాబోయే మూవీలు ఇవే..!

Pulgam Srinivas
ప్రతి వారం లాగానే ఈ వారం కూడా కొన్ని సినిమాలు "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల కాపడానికి రెడీగా ఉన్నాయి. అవి ఏ సినిమాలు ఏ  "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల కాబోతున్నాయో తెలుసుకుందాం.
సార్ : తాజాగా ధనుష్ సార్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా వెంకి అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు  సూర్య దేవర నాగ వంశీ నిర్మించిన ఈ మూవీ కి జీ వీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. ఇప్పటికే ఈ మూవీ సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తెలుగు లో సార్ అనే పేరుతో విడుదల కాగా తమిళ్ లో వేత్తి అనే పేరుతో విడుదల అయింది. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్  "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఈనెల 17వ తేదీ నుండి స్ట్రీమింగ్ కాబోతుంది.
రైటర్ పద్మభూషణ్ : తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి టాలెంట్ ఉన్న నటుడుగా పేరు తెచ్చుకున్న సుహాస్ హీరోగా రూపొందిన ఈ సినిమా జీ 5  "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఈ నెల 17వ తేదీ నుండి స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ మూవీ లో సుహాస్ కు జంటగా టీనా నటించింది.
బ్లాక్ ఆడమ్ : ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో  "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఈనెల 15వ తేదీ నుండి స్ట్రీమింగ్ కాబోతుంది.
గందధగుడి : ఈ మూవీ మార్చి 17 వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో  "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.
లాక్ : ఈ మూవీ జీ 5  "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో మార్చి 17 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కాబోతుంది.
సత్తి గాని రెండెకరాలు : మార్చి 17 వ తేదీ నుండి ఆహా  "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ott

సంబంధిత వార్తలు: