"కబ్జా" మూవీ రన్ టైమ్ లాక్..!

Pulgam Srinivas
శాండిల్ వుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న ఉపేంద్ర మరియు కిచ్చ సుదీప్ ల గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరు క్రేజీ హీరోలు ఇప్పటికే ఎన్నో విజయవంతమైన మూవీ లలో హీరో లుగా నటించి శాండిల్ వుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలుగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ స్టార్ హీరోలు కేవలం శాండిల్ వుడ్ ఇండస్ట్రీ లో మాత్రమే కాకుండా ఇతర భాష సినిమాల్లో కూడా నటించి దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్నారు.


అందులో భాగంగా ఈ ఇద్దరు హీరో లు ఇప్పటికే అనేక స్ట్రేట్ తెలుగు మూవీ లలో కూడా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా తమకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. ఇది ఇలా ఉంటే ఈ ఇద్దరు స్టార్ హీరోలు తాజాగా కబ్జా అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో కలిసి నటించారు. ఈ మూవీ మార్చి 17 వ తేదీన దాదాపు 7 భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బంధం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా ... వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ సినిమా బృందం ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసింది. సెన్సార్ బోర్డు నుండి ఈ సినిమా కు యు / ఏ సర్టిఫికెట్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా యూనిట్ ఈ మూవీ రన్ టైమ్ ను కూడా లాక్ చేసింది. ఈ సినిమా 136 నిమిషాల నిడివి తో  ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తుంది. ఆర్ చంద్రు దర్శకత్వం వహించిన ఈ మూవీ కి రవి బస్తుర్ సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: