"కబ్జా" సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..!

Pulgam Srinivas
కన్నడ సినిమా ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న ఉపేంద్ర మరియు కిచ్చ సుదీప్ ల గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు  ఈ ఇద్దరు హీరో లు ఇప్పటికే ఎన్నో స్టేట్ తెలుగు మూవీ లలో నటించి ఎంతో మంది తెలుగు సినీ ప్రేమికుల మనసు దోచుకున్నారు. ఇలా ఉంటే ఉంటే ఈ ఇద్దరు నటులు తెలుగు లో ఎంతో మంది స్టార్ హీరో ల సినిమాల్లో నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

ఇలా ఇప్పటికే ఎంతో గొప్ప నటులుగా పేరు తెచ్చుకున్న ఈ ఇద్దరు కలిసి తాజాగా కబ్జా అనే మూవీ లో నటించారు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా మార్చి 17 వ తేదీన దాదాపు 7 భాషల్లో భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం అనేక ప్రచార చిత్రాలను విడుదల చేసింది. ఈ ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

అలాగే ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. శ్రీ సిద్దేశ్వర ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్‌ పై నిర్మించిన ఈ పాన్ ఇండియన్ మూవీ లవ్ శివరాజ్‌కుమార్ , శ్రియా శరణ్ , దేవ్ గిల్ , కోట శ్రీనివాసరావు , మురళీ శర్మ , సుధ మరియు కబీర్ దుహన్ సింగ్ ప్రముఖ పాత్రలలో నటించారు. ఈ మూవీ కి ఆర్ చంద్రు దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ఎ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: