షారుఖ్ ఖాన్ తో కలిసి నటించబోతున్న ఆ స్టార్ హీరో..!!

murali krishna
బాలీవుడ్ స్టార్ హీరో అయినా షారుఖ్ ఖాన్ ఈ మధ్యనే "పఠాన్" సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. తాజాగా ఇప్పుడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిన అట్లీ దర్శకత్వంలో "జవాన్" అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని సమాచారం.
అయితే తాజా గా వచ్చిన సమాచారం ప్రకారం ఈ సినిమా లో ఒక ముఖ్య పాత్ర కోసం కోలీవుడ్ స్టార్ హీరో అయిన దళపతి విజయ్ ను సంప్రదించారని సమాచారం.. కానీ అది వర్కౌట్ అవ్వకపోవడంతో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని కూడా అడిగారని సమాచారం.
కానీ అల్లు అర్జున్ కూడా తిరస్కరించేసరికి చిత్ర బృందం బాలీవుడ్ ప్రముఖ నటుడు అయిన సంజయ్ దత్ ను సంప్రదించారని తెలుస్తుంది. సంజయ్ దత్ ఈ సినిమాని ఒప్పుకున్నారటా.. చాలాకాలం తర్వాత షారుక్ ఖాన్ మరియు సంజయ్ దత్ లను ఒకేసారి వెండి తెర పై చూడడానికి అభిమానులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట.. గతంలో కూడా సంజయ్ దత్ మరియు షారుక్ ఖాన్ కొన్ని సినిమాల్లో కలిసి నటించారు ఓం శాంతి ఓం మరియు రావణ్ వంటి సినిమాల లో కలిసి నటించిన ఈ ఇద్దరు హీరోలు తమ నటనతో అందరిని ఆకట్టుకున్నారు.
త్వరలోనే సంజయ్ దత్ తన పాత్రకి సంబంధించిన షూటింగ్ ను కూడా మొదలుపెట్టబోతున్నారని తెలుస్తుంది. మరోవైపు విజయ్ హీరోగా నటిస్తున్న "లియో" సినిమాలో కూడా సంజయ్ దత్ ముఖ్య పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కాశ్మీర్ లో జరుగుతుందటా.ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత సంజయ్ దత్ షారుఖ్ ఖాన్ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారని సమాచారం.ఇక ఈ సినిమా కోసం చిత్ర బృందం భారీ బడ్జెట్ తో షూటింగ్ సెట్ల ను నిర్మిస్తున్నారు.. నయనతార మరియు విజయ్ సేతుపతి కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో కనిపించనున్నారటా..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: