ఉమైర్ సంధు పై గుర్రు మంటున్న రవితేజ ఫ్యాన్స్...!!

murali krishna
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి తన కాళ్ళ పై తాను నిలబడి సక్సెస్ ఐనా హీరోలలో చిరంజీవి తర్వాత రవితేజ కూడా ఒకరు. రవితేజ సినీ ఇండస్ట్రీ లోకి మొదట అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరీయర్ని ప్రారంభించి ఆ తరువాత పలు సినిమాలలో సైడ్ క్యారెక్టర్లలో నటించి హీరోగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు అయ్యారు.
ఇక రవితేజ సోదరులు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సక్సెస్ కాలేకపోయారు. దీంతో కేవలం రవితేజ ఒక్కరే ఇండస్ట్రీలో హీరోగా రాణిస్తున్నారు. ఆమధ్య రవితేజ సోదరులు డ్రగ్స్ కేసులో చిక్కుకున్నట్లుగా కూడా వార్తలు వినిపించాయి. అందులో ఒకరు రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు తెలుస్తోంది.
కానీ రవితేజ మాత్రం తన కెరియర్ లో ఇప్పటివరకు ఎలాంటి చెడు అలవాట్లకు దారి తీసినట్లుగా వార్తలు వినిపించలేదు. కానీ తాజాగా దుబాయ్ సెన్సార్ బోర్డు మెంబర్ ఉమైర్ సంధు రవితేజను టార్గెట్ చేస్తూ ఒక సంచలన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం జరిగింది. రవితేజ గురించి ఈ విధంగా చెప్తూ రవితేజ తో పనిచేయడానికి ఎంతోమంది యంగ్ హీరోయిన్స్ ఐటెం గర్ల్స్ చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారని ఆరోపించారు. సాంగ్ షూటింగ్ సమయంలో ఆయన వారి శరీరాలను పట్టుకొని విధానం చాలా ఇబ్బందికరంగా ఉంటుందని వారు భావిస్తున్నారని కామెంట్స్ చేయడం జరిగింది.
రవితేజ అనేకమంది కొత్త నటీమణులను ఇబ్బంది పెట్టాడు అంటూ రవితేజ గురించి పెను సంచలన ఆరోపణలు చేశారు ఉమైర్ సంధు. దీంతో రవితేజ అభిమానులు ఈయన పైన చాలా గుర్రుగా ఉన్నారు. అసలు ఈ ఉమైర్ సంధు అనే వ్యక్తి ఉన్నారా లేకపోతే ఇది సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారుతోంది.
ఐతే దీనికి సంబంధిచిన వాస్తవ సమాచారం ఐతే ఇంకా బయటకు రాలేదు. రవితేజ కి అతనికి ఏదైనా ఇంతకుముందు పరిచయం ఉందా లేదా అని తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: