"సర్దార్" మూవీకి మొదటిసారి వచ్చిన టిఆర్పి రేటింగ్ ఇదే..!

Pulgam Srinivas
తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటు వంటి కార్తీ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కార్తీ కేవలం తమిళ సినిమా ఇండస్ట్రీ లో మాత్రమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే కార్తీ తాజాగా సర్దార్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. పి ఎస్ మిత్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. స్పై థ్రిల్లర్ జోనర్ లో రూపొందిన ఈ మూవీ తమిళ్ మరియు తెలుగు భాషల్లో మంచి అంచనాల నడుమ విడుదల అయింది.

 మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో రాశి కన్నా ... కార్తీ సరసన హీరోయిన్ గా నటించింది. చాలా కాలంగా సరైన విజయం లేని రాసి కన్నా ఈ మూవీcతో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకొని మంచి కలెక్షన్ లను రాబట్టిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే బుల్లి తెరపై ప్రసారం అయింది. ఈ మూవీ యొక్క తెలుగు వర్షన్ సాటిలైట్ హక్కులను జీ సంస్థ దక్కించుకుంది.

ఈ మూవీ ని కొన్ని రోజుల క్రితమే మొదటి సారి  జీ సంస్థ వారు తెలుగు లో జీ సినిమాలు ఛానల్లో ప్రసారం చేశారు. మొదటి సారి ఈ మూవీ తెలుగు లో బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు కేవలం 1.48 "టి ఆర్ పి" రేటింగ్ ను మాత్రమే సంపాదించుకుంది. థియేటర్ లలో మంచి విజయం సాధించిన ఈ సినిమాకు ఈ రేంజ్ "టి ఆర్ పి" రేటింగ్ అంటే కాస్త తక్కువే అని చెప్పవచ్చు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తో కార్తీ తెలుగు లో మరో విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: