సినిమా మీద కాన్ఫిడెంట్తో ఎక్కడ తగ్గని నాని..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో టైర్-2 హీరోలలో న్యాచురల్ స్టార్ నాని కూడా ఒకరు. గతంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించి ప్రేక్షకులను బాగా అలరించారు. నాని ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో కూడా తన సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. నాని కెరియర్ లోనే అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న చిత్రం దసరా. ఈ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం కూడా పాన్ ఇండియా సినిమా కావడంతో ఆ లెవల్ లోనే సినిమా ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టడం జరిగింది ఇదే నెలలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్లో చాలామంది హీరోలు తమ సినిమాలను విడుదల చేసి సక్సెస్ అందుకున్నారు. ఇక ఇప్పుడు నాని కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు. మొత్తం ఐదు భాషలలో ఒకేసారి ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో హీరో నాని కి జోడిగా కీర్తి సురేష్ నటించింది. ఈ సినిమా ఈనెల 30వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్నది.
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్ బ్యానర్ పై సుధాకర్ చేకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇదంతా ఇలా ఉండగా ఈ సినిమా ట్రైలర్ గురించి తాజాగా చిత్ర బృందం ఒక అదిరిపోయే అప్డేట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఈ రోజున ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ పోస్టర్ కూడా వైరల్ గా మారుతోంది. లక్నోలోని ప్రతిభా థియేటర్లో ఈరోజు మధ్యాహ్నం 3:33 నిమిషాలకి విడుదల చేయబోతున్నారు. నాని ప్రజంటే సౌత్ కంటే నార్త్ మీద ఎక్కువగా దృష్టి పెట్టి అక్కడినుంచి ఈ సినిమా ప్రమోషన్ చేస్తున్నట్లు సమాచారం. సినిమా మీద నమ్మకంతోనే ఇంతలా నాని కష్టపడుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: