ఆ విషయంలో శ్రీదేవి తరువాత స్థానం ఆ స్టార్ హీరోయిన్ దే...!!
ఇక ఇటీవల మమతా మోహన్ దాస్ నయన్ పై కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు అయితే చేసింది. తన సినిమాలో మరొక అమ్మాయి ఉంటె చేయను అని, ఇంకో హీరోయిన్ డ్యాన్స్ వేసిన తాను షూట్ కి రాను అని కండిషన్ కూడా పెట్టిందట. అందుకే హిట్ అయినా సినిమాకు క్రేజ్ మొత్తం కూడా ఆమెకే వచ్చేది. అయితే ఇలా నయన్ పై కామెంట్స్ రావడం కొత్త విషయం ఏమి కాదు. సినిమాల పరంగా అలాగే వ్యక్తి గత జీవితంలోను ఆమె ఎన్నో వివాదాల్లో వుంది.. ఆఖరికి పిల్లలను కనడం పైన కూడా ఆమె ఎన్నో ట్రోల్ల్స్ కి లోనయింది. అయితే ఇంత పెద్ద కాంట్రవర్సీ హీరోయిన్ గా ఒకప్పుడు శ్రీదేవి ఉంటె ఇప్పుడు ఆమె స్థానంలో నయన్ ఉంటుంది.
శ్రీదేవి కూడా పుట్టుక నుంచి చావు వరకు ఎంతో ఇబ్బందులను ఎదుర్కొనింది. చివరికి సినిమాలను ఎంచుకోవడం లో కూడా స్టార్ హీరోలకు దీటుగా ఉండాలని ప్రయత్నించి కొన్ని సార్లు వివాదాలు కొని తెచ్చుకుంది.. ఆలా చిరంజీవి తో ఒక ఐదారు సినిమాలు మొదలై ఆగిపోయాయని సమాచారం.. ఇక నయన్ కూడా ఆ విధంగానే డామినేషన్ చూపిస్తూ ఉంటుందటా.. అందుకే ఆమె శ్రీదేవి కన్నా ఏమాత్రం కూడా తక్కువ కాదు. హీరోయిన్స్ లలో ఇన్ని కండిషన్స్ ఉన్న కూడా స్టార్ హీరోయిన్ గా నంబర్ వన్ స్థానం లో దూసుకుపోవడం శ్రీదేవి తర్వాత కేవలం నయన్ కె సాధ్యం అయింది.