తమ్ముడికి అనుకుంటే అన్నయ్యకి సెట్ యింది....కారణం...!!

murali krishna
టాలీవుడ్ ఇండస్ట్రీలో విలక్షణ నటుడు గా పేరు పొందిన ఒకప్పటి స్టార్ హీరో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఆయన కొడుకు ఐనా మంచు మనోజ్ అనే పేరు వినగానే  మనకు బిందాస్ సినిమా గుర్తుకు వస్తుంది ఈ సినిమాతోనే మనోజ్ మంచి హిట్ కొట్టాడు ఈ సినిమాకి వీరూపోట్ల డైరెక్టర్ గా వ్యవహరించారు.
అయితే ఈ సినిమాతో మనోజ్ కి మంచి పాపులారటి కూడా వచ్చింది.మోహన్ బాబు కొడుకు అనే దగ్గరి నుంచి ఈ సినిమాతో మంచు మనోజ్ అనే ఒక పేరు ని దక్కించుకున్నాడు.మనోజ్ ఆ హిట్ ని క్యాష్ చేసుకుంటే చాలా బాగుండేది.
కానీ ఈ సినిమా తరువాత ఆయనకి వరుసగా సక్సెస్ లు అయితే రాలేదు అందుకే ఆయన సినిమాలు చేయకుండా బిజినెస్ పనులు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది.అయితే మనకు ఈ మధ్య అందిన సమాచారం మేరకు వరుస పరాజయలతో ఉన్న మనోజ్, ఒక మంచి హిట్ సినిమాని మిస్ చేసుకున్నాడు అది ఏ సినిమా అంటే మంచు విష్ణు హీరోగా వచ్చిన దూసుకెళ్తా అనే సినిమా స్టోరీ ని ముందుగా మనోజ్ తో చేయాలని అనుకున్నాడట డైరెక్టర్ వీరు పోట్ల కానీ విష్ణు ఈ స్టోరీ విని మనిద్దరం ఈ సినిమా చేద్దాం అని వీరూపోట్ల గారితో అన్నారట దాంతో ఆయన ఇక చేసేదేం లేక ఆ సినిమా చేశాడు...ఈ సినిమా మంచి విజయం సాధించింది.దాంతో మనోజ్ నేను ఈ సినిమా చేసి ఉంటే బాగుండేది అని అనుకున్నారట.ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఇక పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే మనోజ్ రీసెంట్ గా పెద్దల అంగీకారం తో భూమా మౌనిక రెడ్డి గారిని పెళ్లి చేసుకున్నారు.ఈ పెళ్లికి చాలా మంది సినీ రాజకీయ పెద్దలు వచ్చి వాళ్లిద్దరిని ఆశీర్వదించారు అనే చెప్పాలి.
ఏదేమైనా ఎవరు ఎక్కడ ఉండాలో డిసైడ్ చేసేది ఆ భగవంతుడు అంతే కానీ అన్నీ మనం అనుకున్నట్లు జరగవు. సరిగ్గా మనోజ్ విషయంలో కూడా అదే జరిగింది. ఆయన హీరో గా ఎదగాలని ఇండస్ట్రీలో ఎంతో కష్టపడ్డాడు. కానీ వరుస పరాజయలతో ఎదురు దెబ్బ తగిలిన మనోజ్ మాత్రం పాపం ఇండస్ట్రీ లో నిలదొక్కలేకపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: