వెరైటీగా డైరెక్టర్స్ ని సెలెక్ట్ చేసుకుంటున్న నాచురల్ స్టార్ ' నాని '.....!!

murali krishna
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి వచ్చిన స్టార్ హీరోలలో చాలామంది ఉన్నారు. ఐతే అందులో ఒకరైన నాచరల్ స్టార్ నాని. ఐతే ఆయన తనకంటూ ఇప్పుడు ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు.
ఐతే ఆయన విభిన్న కథలను ఎంచుకుంటూ తనదైన శైలిలో నాని ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాడు. అప్పుడప్పుడు కొన్ని ఫ్లాప్ సినిమాలు పడ్డప్పటికీ మళ్లీ వెంటనే ఏదో ఒక హిట్ సినిమాతో ఫామ్ లోకి వచ్చేస్తూ ఉంటాడు నాని. ఈ మధ్యనే "శ్యామ్ సింగ రాయి" సినిమాతో అట్లానే ఫామ్ లోకి వచ్చిన నాని "అంటే సుందరానికి" సినిమాతో పెద్దగా మెప్పించలేకపోయారు.
ఐతే తాజాగా ఇప్పుడు "దసరా" మూవీ తో కచ్చితంగా హిట్టు కొడతారనే నమ్మకంతో ఈనెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. శ్రీకాంత్ ఓదెల అనే కొత్త డైరెక్టర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తర్వాత నాని శౌర్యువ్ అనే మరొక కొత్త డైరెక్టర్ దర్శకత్వంలో ఒక సినిమాని సైన్ చేశారు. ఐతే నాని30 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. కానీ వరుస పెట్టి నాని కొత్త డైరెక్టర్లతో సినిమాలు ఎందుకు చేస్తున్నాడు అని అభిమానుల్లో ప్రశ్నలు మొదలయ్యాయి. అయితే దీని వెనక పెద్ద కారణమే ఉందట. కేవలం కథ నచ్చగానే నాని ఈ ఇద్దరు డైరెక్టర్లకి ఓకే చెప్పలేదట.
ఐతే మనకున్న తాజా సమాచారం ప్రకారం శ్రీకాంత్ మరియు శౌర్యువ్ వచ్చి తమ కథలను చెప్పినప్పుడు నాని స్వయంగా వాళ్ళిద్దరికీ కొంత డబ్బును ఇచ్చి సినిమాలలోని ఏదో ఒక సన్నివేశాన్ని షూట్ చేసి తీసుకు రమ్మని చెప్పారట. వాళ్ళిద్దరూ అలానే తమ సినిమాకి సంబంధించిన సన్నివేశాన్ని షూట్ చేసి తీసుకొచ్చి తీసుకొచ్చారట. వాళ్ళిద్దరి టాలెంట్ కి ఫిదా అయిపోయా నాని అప్పుడు సినిమాకి ఒకే చెప్పారట. కొత్త డైరెక్టర్లు అయినప్పటికీ వారి టాలెంట్ చూసే నాని ఈ అవకాశాన్ని ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి నాని ఈ సినిమాలతో ఎంతవరకు హిట్లు అందుకుంటాడో వేచి చూడాలి.
ఏదైతేనేం ప్రెసెంట్ డైరెక్టర్స్ ని డిఫరెంట్ గా తన మూవీస్ కి సెలెక్ట్ చేసుకోవడం పై తన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల కొత్త డైరెక్టర్స్ యొక్క పనితనం తెలుస్తుంది అని ఆయన అభిప్రాయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: