పవన్ కళ్యాణ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఎస్.జె. సూర్య..!!

murali krishna
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి 10 సంవత్సరాలు కాగా పవన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య కూడా బాగా పెరుగుతోంది. పవన్ ఏదో ఒకరోజు సీఎం కావాలని ఆయన అభిమానులు అలాగే శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు.
అయితే ప్రముఖ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన ఎస్.జే సూర్య సీఎం పవన్ నా ఫ్రెండ్ అని చెప్పుకునే రోజు రావాలి అని అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం విశేషం.. పవన్ సూర్య కాంబోలో ఖుషి మరియు కొమరం పులి సినిమాలు వచ్చాయి.
ఈ సినిమాలలో ఖుషి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే పులి మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. కొమరం పులి సినిమా ఫ్లాప్ అయినా కూడా పవన్ సూర్య మధ్య మంచి అనుబంధం అయితే ఉంది. తన ఫేవరెట్ హీరోలలో పవన్ కళ్యాణ్ ఒకరని సూర్య ఎన్నో సందర్భాల్లో చెప్పారు. పవన్ హీరోగా 27 సంవత్సరాలు, జనసేన నేతగా 10 సంవత్సరాలు కెరీర్ ను పూర్తి చేసుకున్న నేపథ్యంలో సూర్య పవన్ కు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. పవన్ కళ్యాణ్ తెరపై మాత్రమే కాదని పొలిటికల్ గా కూడా గొప్ప లీడర్ అని ఆయన ప్రజల కొరకు చేసే పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని ఆయన చెప్పుకొచ్చారటా..
ఏపీ సీఎం పవన్ నా బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకరని చెప్పుకునే రోజు కోసం నేను ఎదురుచూస్తున్నానని పవన్ కళ్యాణ్ సీఎం కావడం ఎంతోమంది కల అని కూడా ఆయన కామెంట్లు చేయడం విశేషం.. తమిళ పరిశ్రమలో ఎంజీఆర్ సినిమాల్లో అలాగే రాజకీయాల్లో రాణించారని ఆయన తెలిపారు. పవన్ కళ్యాణ్ స్పీచ్ లను చూస్తే నాకు ఎంజీఆర్ గుర్తుకొస్తారని ఎస్.జే. సూర్య వెల్లడించారు. రాజకీయాల్లో ఆలోచనలు అలాగే సినిమాల్లో ఛరిష్మా పుట్టుకతో వస్తాయని ఆయన కామెంట్లు కూడా చేశారు. పవన్ ప్రస్తుతం పలు సినిమా ప్రాజెక్ట్ లతో బిజీ బిజీగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: