ఆ యంగ్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన రవితేజ..?

Pulgam Srinivas
మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రవితేజ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఇలా ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరోగా నటించిన రవితేజ ఇప్పటికే తన కెరీర్ లో ఎంతో మంది కొత్త దర్శకులకు మరియు యువ దర్శకులకు అవకాశాలను ఇచ్చి కూడా ఎన్నో విజయలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు.
ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం ధమాకా మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న రవితేజ ... ఈ సంవత్సరం చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించి ఈ మూవీ తో కూడా మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే రవితేజ ప్రస్తుతం రావణాసుర ... టైగర్ నాగేశ్వరరావు మూవీ లలో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ రెండు మూవీ ల షూటింగ్ లు కూడా జరుగుతున్నాయి.
ఇలా ఈ రెండు మూవీ లతో ఫుల్ బిజీగా ఉన్న రవితేజ తన తదుపరి మూవీ ని కూడా ఓకే చేసినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ దర్శకుడు అయినటు వంటి ప్రశాంత్ వర్మ తాజాగా రవితేజ కు ఒక కథ ను వినిపించినట్లు ... ఆ కథ బాగా నచ్చిన రవితేజ వెంటనే ప్రశాంత్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ... మరి కొన్ని రోజుల్లోనే ఈ క్రేజీ కాంబినేషన్ కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడనున్నట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. ఇప్పటి వరకు ఈ వార్తకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన వేలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: