చిరంజీవి అలా చేయడంవల్ల.. ఇప్పటికీ ఈఎంఐ కడుతున్న రామ్ చరణ్?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమంలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి నెంబర్ వన్ హీరోగా ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇక తండ్రికి తగ్గ తనయుడుగా తన సినిమాలతో ప్రతిసారి నిరూపిస్తూనే ఉంటాడు అని చెప్పాలి.  ఇక ఇటీవలే త్రిబుల్ ఆర్ సినిమాతో ఇక గ్లోబల్ స్టార్ గా కూడా మారిపోయాడు రామ్ చరణ్. ప్రస్తుతం అంతర్జాతీయ వేదికలపై సందడి చేస్తూ ఉన్నాడు అని చెప్పాలి.

 ఇకపోతే ఇక జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన త్రిబుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ప్రస్తుతం ఆస్కార్ అవార్డు నామినేషన్స్ లో ఫైనల్ లిస్టు లోకి చేరింది అన్న విషయం తెలిసిందే. తప్పకుండా ఈ పాట అటు ఆస్కార్ అవార్డు దక్కించుకోవడం ఖాయం అని ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉన్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఇప్పటికే విదేశాల్లో ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ బిజీగా మారిపోయాడు రామ్ చరణ్. ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక ఆసక్తికర విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు అని చెప్పాలి.

 తన తండ్రి గురించి గొప్పగా చెబుతూనే.. ఒక షాకింగ్ విషయాన్ని బయట పెట్టాడు. మా నాన్న మాకంటూ ప్రత్యేకమైన గుర్తింపు రావాలని ప్రతిసారి అనుకునేవారు. ఆయన పెద్ద స్టార్ అయినప్పటికీ ఇంట్లో మాత్రం మామూలు మనిషి లాగే ఉండేవారు. ఇక ఆయన అవార్డులు కూడా ఇంట్లో ఎక్కువగా పెట్టేవారు కాదు. ఇక చిన్న స్థాయి నుంచి వచ్చారు కాబట్టి ఇప్పటికీ ఆయన గురించి ఆయన గొప్పలు చెప్పుకోవడానికి ఇష్టపడరు. ఇక మమ్మల్ని కూడా అలాగే పెంచారు. ఆయన అలా పెంచారు కాబట్టి ఇప్పటికీ నా ఇఎంఐలు నేనే కట్టుకుంటున్నాను అంటూ సరదాగా కామెంట్ చేశాడు రామ్ చరణ్. సాధారణంగా ఏ కుటుంబంలో అయినా కొడుకుల ఈఎంఐలు తండ్రులు కట్టడం చూస్తూ ఉంటాం. కానీ మా నాన్న మాత్రం ఎవరి పని వాళ్ళే చేసుకోవాలని అంటూ ఉండటం వల్ల.. ఇక నాకు ఈ ఈఎంఐ నేనే కట్టుకుంటున్న  అంటూ రాంచరణ్ చెప్పుకుచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: