బూతులు మాట్లాడి.. గట్టిగానే లాభం పొందిన వెంకటేష్?

praveen
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేక్షకులు అందరూ కూడా ఒకే విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. అదే దగ్గుబాటి వారసులు రానా, వెంకటేష్ తండ్రి కొడుకులుగా నటించినా రానా నాయుడు వెబ్ సిరీస్ గురించి. నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ లో వెంకటేష్ తన కెరియర్ లో ఎప్పుడూ లేనంతగా బోల్డ్ గా కనిపించాడు అని చెప్పాలి. బూతులు మాట్లాడుతూ అందరిని ఆశ్చర్యపరిచాడు వెంకటేష్. అయితే వయసు పైబడిన తర్వాత గత కొంతకాలం నుంచి వైవిద్యమైన సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు వెంకటేష్.

 ఇక ఇప్పుడు తనకు అస్సలు టచ్ లేని బోల్డ్ కంటెంట్ లో కూడా నటించాడు అని చెప్పాలి. దీంతో ఇక వెంకటేష్ కొత్త అవతారం చూసి అభిమానులు అందరూ కూడా షాక్ అవుతున్నారు. ఈ వెబ్ సిరీస్ లో వెంకటేష్ నోటి నుంచి పచ్చి బూతులు రావడం చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే ఇక బూతులు విషయం పక్కన పెడితే ఈ పాత్రలో మాత్రం వెంకటేష్ నటన అదుర్స్ అని చెప్పాలి. ఇక తన నటనతో ప్రేక్షకులను మెప్పించేసాడు. అయితే మరోవైపు నుంచి వెంకటేష్ ఇలాంటి పాత్రలు చేయడం ఏంటి అని విమర్శలు కూడా వస్తున్నాయని చెప్పాలి.

 ఏది ఏమైనా వెంకటేష్ ఇలా బూతులు మాట్లాడే పాత్ర చేసినందుకు గట్టిగానే రెమ్యూనరేషన్ అందుకున్నాడు అన్నది మాత్రం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఏకంగా పచ్చి ముసలోడి పాత్రలో నటించినందుకుగాను వెంకటేష్ ఏకంగా 12 కోట్ల పారితోషకాన్ని సొంతం చేసుకున్నాడు. సీనియర్ హీరోకి ఒక వెబ్ సిరీస్ కోసం ఇంత పెద్ద మొత్తంలో రావడం మాత్రం నిజంగా గొప్ప విషయం అని చెప్పాలి. అయితే యువ హీరో రానా మాత్రం 8 కోట్ల వరకు పారితోషకం తీసుకున్నాడు అని టాక్ నడుస్తుంది. అయితే ఇక ఈ వెబ్ సిరీస్ చూడాలి అనుకునేవారు ఫ్యామిలీతో కాకుండా ఒంటరిగానే చూస్తే బెటర్ అని ఇప్పటికే రానా చెప్పేసాడు. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాలో సెక్స్ సీన్స్, బూతులు కూడా ఉండాల్సిన దాని కంటే ఎక్కువే ఉన్నాయని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: