వెంకటేష్ బట్టలు విప్పించారని.. ముందే హింట్ ఇచ్చిన బాలయ్య?

praveen
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ఒక వెబ్ సిరీస్ గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ఆ వెబ్ సిరీస్ ఏదో కాదు దగ్గుబాటి వారసులు అయిన వెంకటేష్ రానా కీలక పాత్రలో నటించిన రానా నాయుడు. ఒక అమెరికన్ సిరీస్ ని ఇండియన్ అడాప్షన్ గా చేసుకుని ఈ సిరీస్ ని తెరకెక్కించారు అని చెప్పాలి. ఇది ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ సిరీస్ ఎలా ఉండబోతుందో అని ఆసక్తితో ప్రతి ఒక్కరు చూశారు. కానీ చూసిన తర్వాత ముక్కున వేలేసుకుంటున్నారు.

 కారణం ఈ వెబ్ సిరీస్లో వెంకటేష్ పాత్ర. ఇప్పటివరకు వెంకటేష్ అంటే ఫ్యామిలీ హీరోగా మాత్రమే సినీ ప్రేక్షకులకు తెలుసు. మొదటి నుంచి అలాంటి సినిమాలను మాత్రమే చేసుకుంటూ గుడ్ ఇమేజ్ ని సంపాదించుకున్నాడు వెంకటేష్. ఇక ఫ్యామిలీ ఎమోషన్స్ పండించడంలో ఆయన కంటే తోపు ఇంకెవరూ లేరేమో అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇటీవల విడుదలైన రానా నాయుడు వెబ్ సిరీస్ చూస్తే మాత్రం అందరికీ తెలిసిన వెంకటేష్ ఏ ఒక్క సీన్ లో కూడా కనిపించడు. బూతులు మాట్లాడుతూ ఎవరితో పడితే వాళ్లతో సెక్స్ చేస్తూ వెంకటేష్ పాత్ర సాగిపోతూ ఉంటుంది.

 అయితే నెట్ ఫ్లిక్స్ లో వెబ్ సిరీస్ చూసే అభిమానులకు ఇది కామన్ అనిపించొచ్చు. కానీ రానా, వెంకటేష్ లాంటి సాఫ్ట్ ఇమేజ్ గా ఉన్న స్టార్ హీరోలు ఇలాంటి పాత్రలో చూసి మాత్రం చాలా మంది ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు అని చెప్పాలి. అయితే ఇప్పుడు వరకు రానా అయినా సినిమాల్లో కొద్దో గొప్పో రొమాంటిక్ సీన్లలో నటించాడు. కానీ వెంకటేష్ మాత్రం పూర్తిగా ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలతోనే ప్రేక్షకులను అలరించాడు. అయితే వెంకటేష్ పాత్రి గురించి గతంలోనే బాలయ్య చెప్పాడు అన్న ఒక విషయం మాత్రం హాట్ టాపిక్ మారిపోయింది. రానా గతంలో అన్ స్టాపబుల్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలోనే వివేకానందుడు లాంటి మీ బాబాయి చేత బట్టలిప్పించేసావు కదా రానా అంటూ బాలయ్య అనడం ఇక రానా పెద్దగా నవ్వుకోవడం జరిగింది. కానీ ఈ వెబ్ సిరీస్ పాత్ర గురించి తెలియక అప్పట్లో ఎవరు ఇది పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు చూసిన తర్వాత అప్పుడు బాలయ్య ముందే చెప్పాడు మనమే పట్టించుకోలేదు అంటూ ప్రేక్షకులు అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: