"ఓటిటి" లో "పులి మేక" సిరీస్ కు అదిరిపోయే రెస్పాన్స్..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన యువ హీరోలలో ఒకరు అయినటు వంటి ఆది సాయి కుమార్ ఈ మధ్య కాలంలో వరుస మూవీ లతో ప్రేక్షకులను పలకరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. వరుస మూవీ లతో ప్రేక్షకులను పలకరిస్తున్నప్పటికీ ఆదిvకి మాత్రం సరైన విజయం దక్కడం లేదు. ఇది ఇలా ఉంటే తాజాగా ఆది "పులి మేక" అనే వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలో నటించాడు. ఈ వెబ్ సిరీస్ లో అందాల ముద్దు గుమ్మ లావణ్య త్రిపాఠి కూడా ప్రధాన పాత్రలో నటించింది.

మొదటి సారి ఆది మరియు లావణ్య త్రిపాఠి కాంబినేషన్ లో రూపొందిన సిరీస్ కావడంతో ఈ సిరీస్ పై తెలుగు ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ కొన్ని రోజుల క్రితమే ఈ సిరీస్ జి ఫైవ్ "ఓ టి టి" లో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సిరీస్ కు ప్రేక్షకుల నుండి ప్రస్తుతం మంచి ఆదరణ లభిస్తుంది. ప్రేక్షకుల నుండి మంచి ఆదరణను తెచ్చుకుంటున్న ఈ వెబ్ సిరీస్ తాజాగా జీ 5 "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో 100 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్ ను సాధించింది. తాజాగా ఈ విషయాన్ని జీ 5 సంస్థ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది.
 

ఇలా పులి మేక వెబ్ సిరీస్ కు ప్రస్తుతం జీ 5 ప్లాట్ ఫామ్ లో ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది అని చెప్పవచ్చు. ఇది ఇలా ఉంటే మర్డర్ మిస్టరీ గా తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సీరీస్ చక్రవర్తి రెడ్డి దర్శకత్వం వహించగా ... కోనవెంకట్ తో కలిసి చక్రవర్తి రెడ్డి స్వయంగా స్క్రీన్ ప్లే ను అందించారు. సుమన్, రాజా చెంబోలు, గోపరాజు రమణ, ముక్కు అవినాష్, స్పందన పల్లి తదితరులు ఈ వెబ్ సిరీస్ లో ముఖ్యమైన పాత్రలలో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: