ఆ తమిళ దిగ్గజాలు నాకు ఆదర్శం ... నాని..!

Pulgam Srinivas
నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో మూవీ లలో నటించి నటుడు గా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. నాని తాజాగా దసరా అనే పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లో నాని పక్క ఊర మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలలో నాని తన ఊర మాస్ లుక్ లో ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకున్నాడు.

ఇది ఇలా ఉంటే ఊర మాస్ సినిమాకు కొత్త దర్శకుడు అయినటు వంటి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించగా ... కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ని మార్చి 30 వ తేదీన తెలుగు , హిందీ , కన్నడ , మలయాళ , తమిళ్ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ ట్రైలర్ ను ఈనెల 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది.

ఈ మూవీ ట్రైలర్ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం నాని ఈ మూవీ కి సంబంధించిన ప్రచారాలను వేగ వంతం చేశాడు. అందులో భాగంగా తాజాగా నాని తమిళ మీడియాతో ప్రత్యక్షంగా ఇంటరాక్ట్ అయ్యాడు. అందులో భాగంగా నాని మాట్లాడుతూ ... తమిళ సినిమా ఇండస్ట్రీ దిగ్గజాలైన మణిరత్నం , రజినీ కాంత్ , కమల్ హాసన్ వంటి వారు తనకు కెరీర్ పరంగా ఇన్స్పిరేషన్ అని ... అలానే మంచి కాన్సెప్ట్ ఉన్న మూవీ లతో ముందుకి వస్తే తమిళ ఆడియన్స్ తప్పకుండా వాటిని కచ్చితంగా ఆదరిస్తారని నమ్మకాన్ని నాని వ్యక్తం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: