విజయ్ "లియో" లో ఆ బాలీవుడ్ నటుడు ... అధికారక ప్రకటన కూడా వచ్చేసింది..!

Pulgam Srinivas
తమిళ సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయినటు వంటి దళపతి విజయ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ హీరో ఆఖరు గా తమిళం లో రూపొందిన వారిసు అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించాడు. ఈ మూవీ తమిళ భాషలో ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 11 వ తేదీన విడుదల అయ్యి మంచి విజయం అందుకుంది.

ఇదే మూవీ ని తెలుగు లో వారసుడు పేరుతో జనవరి 14 వ తేదీన విడుదల చేశారు. ఈ మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయం అందుకుంది. ఇలా వారిసు మూవీ సక్సెస్ తో మంచి జోష్ లో ఉన్న విజయ్ ప్రస్తుతం లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందుతున్న లియో అనే భారీ బడ్జెట్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యి చాలా రోజులు అవుతుంది. అలాగే ఈ మూవీ షూటింగ్ దాదాపు సగం వరకు పూర్తి కూడా అయినట్లు తెలుస్తుంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో బాలీవుడ్ క్రేజీ నటుడు సంజయ్ దత్ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు అని అనేక వార్తలు బయటకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ వార్తకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలుబడింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాలో సంజయ్ దత్ నటించబోతున్నట్లు అధికారికంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఇలా ఈ మూవీ లో సంజయ్ దత్ నటిస్తూ ఉండడంతో ఈ మూవీ పై బాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి అంచనాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: