భోళా శంకర్ మ్యానియాను పెంచబోతున్న పవన్ అభిమానులు !

Seetha Sailaja

‘వాల్తేరు వీరయ్య’ మూవీ ఎవరు ఊహించని విధంగా 135 కోట్ల నెట్ కలక్షన్స్ వసూలు చేయడంతో జోష్ లో ఉన్న చిరంజీవి దసరా రేస్ కు రాబోతున్న ‘భోళా శంకర్’ మూవీ కూడ బ్లాక్ బష్టర్ హిట్ చేసి తీరాలి అన్న పట్టుదలతో ఆ సినిమాను తీర్చిదిద్దడంలో ఎన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ను ఆ మూవీలో పెడుతున్నారు.
 
 
ఈసినిమాలో చిరంజీవి పాత్ర పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా కనిపిస్తాడట. అంతేకాదు పవన్ కళ్యాణ్ బ్లాక్ బష్టర్ మూవీ ‘ఖుషీ’ లోని భూమికా పవన్ ల మధ్య నడిచిన నడుము సీన్ ను మక్కీకి మక్కీగా ‘భోళా శంకర్’ మూవీలో దింపి ఆ సీన్ ను శ్రీముఖి చిరంజీవిల మధ్య ఈమధ్యనే షూట్ చేసారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సీన్ షూట్ చేస్తున్నంత సేపు చిరంజీవి పవన్ బాడీ లాంగ్వేజ్ ని అనుసరించడమే కాకుండా ఆ సీన్ చేస్తున్నంత సేపు చిరంజీవి మాటలలో పవన్ జ్ఞాపకాలు అందరితోను మెగా స్టార్ షేర్ చేసుకున్నట్లు టాక్.
 
 
వాస్తవానికి ఈ మూవీ అజిత్ నటించిన తమిళ సినిమా ‘వేదాళం’ రీమేక్ అయినప్పటికీ చిరంజీవి తన అభిమానులను దృష్టిలో పెట్టుకుని దర్శకుడు మెహర్ రమేష్ చేత అనేక మార్పులు చేయించాడు అని అంటున్నారు. ఈ మూవీలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈమధ్య కాలంలో సిస్టర్ సెంటిమెంట్ సినిమాలు పెద్దగా తెలుగులో రాలేదు.
 
 
ఒకప్పుడు ఇండస్ట్రీని శాసించిన సిష్టర్ సెంటిమెంట్ ను మళ్ళీ ఈ మూవీ ద్వారా తెరపైకి తీసుకు రావడంతో ఈ మూవీ ఊహించిన విధంగా బ్లాక్ బష్టర్ హిట్ అయితే మళ్ళీ తెలుగులో చాల సిస్టర్ సెంటిమెంట్ కథల సినిమాలు సందడి చేసే ఆస్కారం ఉంది. వాస్తవానికి ఈ సినిమాను సమ్మర్ రేస్ లో విడుదలచేయాలని అనుకున్నారు. అయితే చిరంజీవి సూచనతో ఈ మూవీ దసరా రేస్ కు నిలబెట్టాలని ఆలోచనలు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: