బాబోయ్.. జబర్దస్త్ కమెడియన్ పవిత్ర నోటా.. బూతు మాట?

praveen
ప్రేక్షకులందరికీ సరికొత్తగా ఎంటర్టైన్మెంట్ అందించడమే లక్ష్యంగా ఎప్పటికప్పుడు వినూత్నమైన బుల్లితెర  కార్యక్రమాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఎన్ని కార్యక్రమాలు వచ్చినా కూడా మంచి ఆదరణ పొందుతూ టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇలా తెలుగు బుల్లితెరపై ఆడియన్స్ ని  విశేషంగా ఆకట్టుకుంటూ టాప్ రేటింగ్స్ సొంతం చేసుకుంటున్నా కార్యక్రమాలలో లేడీస్ అండ్ జెంటిల్మెన్ కూడా ఒకటి అని చెప్పాలి. ప్రదీప్ యాంకరింగ్ చేస్తున్న ఈ కార్యక్రమం ప్రస్తుతం జీ తెలుగు చానల్లో ప్రసారమవుతుంది. ప్రతి ఆదివారం కూడా ఈ ఎపిసోడ్ ప్రసారమై ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పంచుతూ ఉంటుంది అని చెప్పాలి.

 అయితే ఇటీవల కాలంలో బుల్లితెర కార్యక్రమాలకు సంబంధించిన ప్రోమోలను ముందుగానే విడుదల చేయడం.. ఆ ప్రోమోలో ఎపిసోడ్లో ఉండే ఎంటర్టైన్మెంట్ గురించి ఆడియన్స్ అందరికీ కూడా ఒక హింట్ ఇవ్వడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఇక ఇటీవలే లేడీస్ అండ్ జెంటిల్మెన్ షో కి సంబంధించి ఇటీవలే ప్రోమో విడుదలైంది. అయితే ఇందులో చూసుకుంటే జబర్దస్త్ ఆర్టిస్టులతో ప్రోమో మొత్తం సందడిగా సాగింది అని చెప్పాలి. ఎప్పటి లాగానే ఈ షోలో మళ్లీ అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందుతుంది అన్నది తెలుస్తుంది.

 ఇదిలా ఉంటే.. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న జబర్దస్త్ లేడీ కమెడియన్ పవిత్ర ఏకంగా డబుల్ మీనింగ్ పంచులతో రెచ్చిపోయింది అని చెప్పాలి. ఇక ఆమె నోటి నుంచి వచ్చిన బూతు మాటలు కాస్త ప్రస్తుతం చర్చనియాంశంగా మారిపోయాయి. ప్రోమోలో చూసుకుంటే... ముందుగా ఎంట్రీ ఇచ్చింది పవిత్ర. ఆ తర్వాత తాగుబోతు రమేష్ ఎంట్రీ ఇవ్వగా రమేష్ గారు షో కి కూడా హెల్మెట్ పెట్టుకుని వచ్చారు అంటూ డబుల్ మీనింగ్ పంచ్ వేసింది. దీంతో అందరూ షాక్ అయ్యారు. ఆ తర్వాత ఆయన టీ షర్టుపై హెల్మెట్ ఉంది అంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది పవిత్ర. ఇక ఆ తర్వాత ఒక గేమ్ లో భాగంగా పవిత్ర ఇచ్చిన క్లూస్ బుల్లెట్ భాస్కర్ గుర్తించకపోవడంతో నీ అక్క అంటూ బూతులు తిట్టేసింది. కాగా ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: