అందాలతో అందరిని కట్టిపడేస్తున్న శ్రీముఖి..!!

Divya
గ్లామర్ షో విషయంలో ఎప్పుడు ఒకే తరహా వాటిని ఫాలో అవ్వకుండా ఉంటుంది బుల్లితెర యాంకర్ శ్రీముఖి. సరికొత్తగా అందాలను ప్రదర్శించడంలో ఈమెకు సాటి ఎవరూ రారని చెప్పవచ్చు. ఒకప్పటి ఫోటోలు బయటకు తీసి మరి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం శ్రీముఖి కెరియర్ పీక్స్ లో ఉందని చెప్పవచ్చు ఇటీవల శ్రీముఖి కొత్త ఇంటికి గృహప్రవేశం కూడా చేసింది. శ్రీముఖి నెల సంపాదన ప్రస్తుతం కొన్ని లక్షలలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో పాటు గృహప్రవేశం కార్యక్రమాన్ని నిర్వహించింది శ్రీముఖి.
ప్రస్తుతం జాతి రత్నాలు, స్టార్ మా పరివార్ ,మిస్టర్ అండ్ మిసెస్ వంటి షోలకు యాంకర్ గా వ్యవహరిస్తోంది. డీబీ జోడి అనే డాన్స్ రియాల్టీ షో కూడా ఈమె యాంకర్ గా వ్యవహరిస్తోంది శ్రీముఖి. యాంకర్ గా తనదైన స్టైల్ లో కలిగి ఉండడమే ఆమెకు బాగా కలిసి వస్తోంది. సినిమాలలో అడపాదడపాత్రలలో నటిస్తున్న పెద్దగా సక్సెస్ కాలేకపోతోంది. పటాస్ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీముఖి అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ -3 లో కూడా పాల్గొన్న ఈమె ఆట తీరుతో విన్నర్ అవుతుందనుకున్నారు కానీ టైటిల్ రన్నర్ గా మిగిలిపోయింది శ్రీముఖి.
యాంకర్ గా అవకాశాలు వస్తున్నప్పటికీ శ్రీముఖి వెండితెర పైన రాణించాలని కోరుకుంటోంది .ఇందులో భాగంగా క్యారెక్టర్ రోజుల్లో కూడా చేస్తోంది. ఇక సోషల్ మీడియాలో తన అందచందాలతో అందరిని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. గడచిన కొద్ది రోజుల క్రితం నుంచి శ్రీముఖి ఒక బిజినెస్ మాన్ తో రిలేషన్ లో ఉందంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా శ్రీముఖి బ్లాక్ అండ్ వైట్ దుస్తులను తన నడుము అందాలను చూపిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అంతేకాకుండా తన కళ్ళతో మాయ చేసే విధంగా కనిపిస్తోంది శ్రీముఖి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: