రానా నాయుడు విడుదల.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ?

Purushottham Vinay
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరి వెంకటేష్, యంగ్ హీరో రానా దగ్గుబాటి కలిసి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు.అమెరికన్ టీవీ సిరీస్ అయిన రే డొనావన్‌ను ఇండియన్ అడాప్షన్‍గా తెరకెక్కిన ఈ ఫ్యామిలీ సిరీస్‌ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది.ప్రముఖ OTT నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఆలస్యంగా ఈ సిరీస్ రిలీజ్ అయ్యింది. శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతుందని మేకర్స్ ముందు నుంచి చెప్పడంతో గురువారం నాడు అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్‌కు వస్తుందని చాలా మంది కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ శుక్రవారం నాడు మధ్యాహ్నం 2 గంటల తర్వాత కానీ ఈ సిరీస్ అనేది స్ట్రీమింగ్ ప్రారంభం కాలేదు.టాలీవుడ్ బెస్ట్ బాబాయ్ అబ్బాయిలుగా పేరు తెచ్చుకున్న రానా ఇంకా వెంకటేష్ కలిసి నటిస్తున్న వెబ్ సిరీస్ కావడంతో అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూశారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఇంకా అలాగే ప్రమోషనల్ వీడియోలకు అంచనాలు బాగా పెరిగాయి. ఇంకా ఈ క్రమంలోనే గురువారం నాడు రాత్రి ఈ సిరీస్ ప్రీమియర్‌ను ప్రదర్శించడం జరిగింది.


సినీ పరిశ్రమకు చెందిన పలువురు ఈ షోను చూసారు. ఇక ఈ సందర్భంగా మాట్లాడిన వెంకటేష్.. ఇంట్లోనే సిరీస్‌ను చూసి అందరూ ఎంతగానో ఆదరించాలని కోరారు.అమెరికన్ టీవీ సిరీస్ అయిన రే డోనోవన్‌కు రీమేక్‌గా ఈ రానా నాయుడు తెరకెక్కింది.కరణ్ అన్షుమాన్ ఇంకా సుపర్ణ్ వర్మ సంయుక్తంగా తెరకెక్కించారు. లోకోమోటివ్ గ్లోబల్ మీడియా పతాకంపై సుందర్ ఆరోన్ ఈ సిరీస్‌ను నిర్మించడం జరిగింది. ఈ సిరీస్ లో సుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్, ఆశిష్ విద్యార్థి, గౌరవ్ చోప్రా, సుచిత్రా పిళ్లై వంటి నటులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. శుక్రవారం నాడు నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ షో స్ట్రీమింగ్ అవుతోంది.ఇక ఇప్పుడు ఈ షో స్ట్రీమింగ్ కావడంతో దగ్గుబాటి అభిమానులు ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రానా, వెంకటేష్ ని ఇలా ఒకేసారి చూడటం వల్ల దగ్గుబాటి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. చూడాలి ఈ షో ఎంత బాగా ఆకట్టుకుంటుందో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: