హిందీలో డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తలపతి విజయ్ లేటెస్ట్ మూవీ..!

Pulgam Srinivas
తమిళ సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్న తలపతి విజయ్ తాజాగా తమిళంలో రూపొందిన వారిసు అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి మంచి టాలెంట్ కలిగిన దర్శకుడు అయినటు వంటి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా ... తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటికే ఎన్నో మూవీ లను నిర్మించి అత్యద్భుతమైన టాలెంట్ ఉన్న నిర్మాతగా పేరు తెచ్చుకున్న దిల్ రాజు ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించాడు.

ఈ మూవీ తమిళ వర్షన్ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 11 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల అయింది. తెలుగు లో ఈ మూవీ వారసుడు అనే పేరుతో విడుదల అయింది. ఈ మూవీ తెలుగు వర్షన్ జనవరి 14 వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల అయింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్ లను తెచ్చుకుంది. తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి కలక్షన్ ను తెచ్చుకున్న ఈ మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ మూవీ గా నిలిచింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ మూవీ ఇప్పటికే సౌత్ భాషలలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటు లోకి వచ్చింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యొక్క హిందీ వర్షన్ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటు లోకి వచ్చింది. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ మూవీ హిందీ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. ఈ మూవీ లో రష్మిక మందన విజయ్ సరసన హీరోయిన్ గా నటించగా ... తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. శ్రీకాంత్ ఈ మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: