వాళ్ళపై పోలీసులకి ఫిర్యాదు చేసిన నటి నగ్మా...!!

murali krishna
ఈ మధ్య కాలంలో  పెరిగిన టెక్నాలజి లో భాగంగా సాంకేతికతను ఉపయోగించుకొని సైబర్ మోసగాళ్లు పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే సాధారణ ప్రజల నుంచి మొదలుకొని సెలబ్రిటీల వరకు వీరు టార్గెట్ చేస్తూ ప్రతి ఒక్కరి నుంచి లక్షలకు లక్షలు డబ్బు దోచుకొని సొమ్ము చేసుకుంటున్నారు.ఇలా ఎంతో మంది సెలబ్రిటీలు కూడా తాము మోసపోయామంటూ సైబర్ పోలీసులను ఆశ్రయించిన సంగతి మనకు తెలిసిందే.
తాజాగా ముంబై సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి తాను సైబర్ వలలో చిక్కుకొని లక్ష రూపాయలు పోగొట్టుకున్నట్లు వెల్లడించారు.
ఐతే ఫిబ్రవరి 28వ తేదీ నటి నగ్మా మొబైల్ కు బ్యాంక్ నుంచి ఏదో మెసేజ్ రావడంతో ఈమె ఆ మెసేజ్ పై క్లిక్ చేసింది. అనంతరం తనకు ఒక ఫోన్ కాల్ వచ్చిందని అవతల నుంచి వ్యక్తి తాను బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నానని తనకు తాను పరిచయం చేసుకున్నట్లు ఈమె తెలిపారు. ఈ విధంగా బ్యాంకు ఎంప్లాయ్ గా పరిచయం చేసుకున్నటువంటి కేటుగాడు నటి నగ్మాను కేవైసీ అప్డేట్ చేయాలని కోరారు. ఆమె తన బ్యాంక్ వివరాలు తెలియచేయనప్పటికీ అవతల నుంచి ఆన్లైన్ బ్యాంకులో లాగిన్ అయ్యి ఖాతా తెరిచి నగ్మా అకౌంట్ నుంచి లక్ష రూపాయలు తన అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లు ఈమె వెల్లడించారు. ఇలా అవతల వ్యక్తి లాగిన్ అయ్యే సమయంలో నటి నగ్మా మొబైల్ కు దాదాపు వరుసగా ఇరవై వరకు ఓటీపీలు వచ్చాయని నగ్మా వెల్లడించారు. అయితే సైబర్ నేరగాళ్లు తన అకౌంట్ నుంచి పెద్ద మొత్తంలో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయకుండా కేవలం లక్ష రూపాయలు మాత్రమే ట్రాన్స్ఫర్ చేయడంతో ఈమె బాధలో కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు.సాధారణంగా సెలబ్రిటీల అకౌంట్ అంటే పెద్ద మొత్తంలోనే డబ్బు ఉంటుంది. కానీ ఆ వ్యక్తి మాత్రం అకౌంటు నుంచి లక్ష రూపాయలు మాత్రమే ట్రాన్స్ఫర్ చేసుకోవడంతో ఈమె కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇదే బ్యాంకులో ఖాతాలు ఉన్నటువంటి మరో ఎనభై మంది వరకు ఇదే తరహాలో మోసపోవడం గమనార్హం. ఈ క్రమంలోనే ఈ విషయంపై ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఏదేమైనా ఈ సైబర్ నేరగాళ్ళు సాధారణ ప్రజలనే కాకుండా సెలెబ్రేటీస్ ని కూడా వదలకుండా వారి టాలెంట్ చూపిస్తున్నారు. కనుక వారి నుండి జాగ్రత్తగా ఉండాలని నేటిజన్లు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: