మనోజ్ కోసమే మౌనిక రెడ్డి తన మొదటి భర్త కి విడాకులు ఇచ్చిందా..!?

Anilkumar
మంచు మనోజ్ మరియు భూమా మౌనిక కి ఇటీవల పెళ్లయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే మొదట వీళ్ళిద్దరికీ పెళ్లిళ్లు అయ్యే విడాకులు తీసుకున్న తర్వాత మళ్లీ ఇప్పుడు వీళ్ళిద్దరూ రెండవ వివాహం చేసుకున్నారు. మనోజ్ కి పిల్లలు లేరు కానీ మౌనికకి మాత్రం ఒక కొడుకు ఉన్నాడు. అయితే తాజాగా మౌనిక తన మొదటి భర్త విడాకులు ఇవ్వడానికి గల ముఖ్య కారణం మంచు మనోజ్ అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది.అంతేకాదు ఇటీవల మంచు మనోజ్ మాది 12 సంవత్సరాల స్నేహం నాలుగు సంవత్సరాల ప్రేమ అన్న విషయాన్ని కూడా ఇటీవల బయటపెట్టాడు. దీంతో వీరిద్దరి మధ్య 12 సంవత్సరాల ముందు నుండి ప్రేమ ఉందని 

అందరూ భావించడం మొదలుపెట్టారు. వీరిద్దరికే కాదు భూమ కుటుంబానికి మంచి కుటుంబానికి కూడా మొదటి నుంచి మంచి అనుబంధం ఉంది ఈ క్రమంలోనే మౌనికకి మనోజ్ కి మంచి స్నేహం ఏర్పడింది అంటూ అంటున్నారు. మొదట స్నేహితులుగా ఉన్న వీరిద్దరూ కొంతకాలం తర్వాత ప్రేమించుకోవడం మొదలుపెట్టారట. ఇద్దరినీ ఒకరికొకరు ప్రేమించుకుంటున్నప్పటికీ ఆ విషయాన్ని ఎవరు కూడా బయట పెట్టలేదు. అలా వారి ప్రేమ విషయం బయట పెట్టలేకపోవడంతో భూమా నాగిరెడ్డి తన కూతురు మౌనికని ఒక బిజినెస్ మాన్ కి ఇచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి తర్వాత మౌనిక వైవాహిక జీవితం బాగానే ఉంది .దాని అనంతరం తన మొదటి భర్త గణేష్ రెడ్డి కూడా మౌనికకి కొన్ని కండిషన్లను పెట్టాడట.

 అబ్బాయిలతో మాట్లాడకూడదు క్లోజ్ గా ఉండకూడదు అంటూ మౌనికని హెచ్చరించేవాడట. వాటితో పాటు మౌనిక ఎలాంటి పని చేసినా కూడా ఆ పనిని అనుమానించే వాడట తన మొదటి భర్త. పెళ్లి అయిన తర్వాత మనోజ్తో మౌనిక క్లోజ్ గా ఉండడం గంటలకు ఫోన్లో మాట్లాడడం చూసి గణేష్ రెడ్డి మౌనికకు విడాకులు ఇచ్చాడు అనే తెలుస్తుంది. ఈ క్రమంలోనే మౌనికాతనం మొదటి భర్తకి విడాకులు ఇవ్వడానికి ముఖ్య కారణం మనోజే అని అంటున్నారు. అంతేకాకుండా ఈ వార్త విన్న చాలామంది మెడిసిన్లో మౌనికని పెళ్లి చేసుకోవడానికి నీ మొదటి భార్య అయిన ప్రణతి రెడ్డి జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు అంటూ మనోజ్ పై ఒక రేంజ్ లో మండిపడుతున్నారు .అయితే ఏదేమైనప్పటికీ వీళ్లిద్దరూ తమ మొదటి భార్యాభర్తలతో విడిపోయి పెళ్లి చేసుకోవడం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: