అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే బుల్లితెర స్టార్ యాంకర్......!!

murali krishna
టాలీవుడ్ లో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బుల్లితెరపై ఉన్న ఫిమేల్ యాంకర్ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తమదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.
ఇకపోతే శ్రీముఖి, సుమ, వర్షిణి,విష్ణు ప్రియ ఇలా ఎంతోమంది ఫిమేల్ యాంకర్లు రాణిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఫిమేల్ యాంకర్ల రెమ్యూనరేషన్ గురించి సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. ఇకపోతే తాజాగా తెలుగులో ఉన్న ఈ ఫిమేల్ యాంకర్ల రెమ్యూనరేషన్ కి సంబంధించి ఒక వార్తలు కొడుతున్నాయి. మరి ఏ ఏ యాంకర్ ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
తెలుగు బుల్లితెరపై నెంబర్ వన్ యాంకర్ గా దూసుకుపోతున్న యాంకర్ సుమ కనకాల గురించి మనందరికీ తెలిసిందే.. ఇది మొన్నటి వరకు ఏ షోలో, ఏ ఈవెంట్లో, ఏ ఆడియో ఫంక్షన్లలో చూసినా కూడా సుమ కనకాల పేరే వినిపిస్తూ ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో సుమ పేరు చాలా తక్కువగా వినిపిస్తోంది. తన యాంకరింగ్ తో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంటుంది. కాగా సుమ ఒక్కో ఆడియో ఫంక్షన్ కు దాదాపు రూ.2 నుంచి 2న్నర లక్షల వరకు రెమ్యూనరేషన్ ని అందుకుంటుందని సమాచారం. ఇక సుమ తర్వాత అంత క్రేజ్ ని సంపాదించుకున్న యాంకర్ అనసూయ భరద్వాజ్. మొన్నటిదాకా జబర్దస్త్ షోకి యాంకరింగ్ చేస్తూనే మరోవైపు వెండితెరపై నటిగా దూసుకుపోయిన అనసూయ ప్రస్తుతం జబర్దస్త్ షోకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. కాగా అనసూయ కూడా ఒక్కో ఈవెంట్ కు రూ.2 లక్షల రెమ్యూనరేషన్ అందుకుంటుందని సమాచారం. ఇక జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న మరో యాంకర్ రష్మీ గౌతమ్. యాంకర్ గా దశాబ్ద కాలం పాటు టీవీ ఆడియన్స్ ను అలరిస్తున్న రష్మి గౌతమ్ ఒక్కో ఈవెంట్ కు రూ.1.5 లక్షల రెమ్యూనరేషన్ చేస్తుందని టాక్. యాంకర్ శ్రీముఖి.. ఈ మధ్యకాలంలో సుమ,రష్మీ, అనసూయ ల కంటే శ్రీముఖి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. స్పెషల్ ఈవెంట్ లు ప్రోగ్రామ్ లకు యాంకర్ గా వ్యవహరిస్తూ దూసుకుపోతోంది శ్రీముఖి. ఈమె ఒక్కో ఈవెంట్ కు రూ.1 లక్ష వరకు రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నట్టు తెలుస్తోంది. బుల్లితెరపై ఉన్న యాంకర్ లలో యాంకర్ మంజూష కూడా ఒకరు. స్టార్ హీరోల సినిమాకు సంబంధించిన చిన్న ఫంక్లను యాంకర్ గా అవకాశాలు అందుకుంటూ స్మాల్ స్క్రీన్ పై సందడి చేస్తున్నారు. ఈవెంట్ కు రూ.50 వేల వరకు పారితోషికాన్ని అందుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే బుల్లితెర పై ఉన్న మరో యాంకర్ శ్యామల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె కూడా ఒక్కొక్క ఈవెంట్ కి 50 వేల వరకు అందుకుంటున్నట్టు తెలుస్తోంది.
ఏదేమైనా బుల్లితెర స్టార్ యాంకర్స్ కూడా వెండి తెర స్టార్ హీరోయిన్స్ లాగా రెమ్యూనరేషన్ పరంగా ఏ మాత్రం తగ్గడం లేదు అని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటు న్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: