శోభనబాబు తన కొడుకులని సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంచడానికి కారణం అదేనా....!!

murali krishna
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సోగ్గాడు ఎవరంటే ఎవరినైనా అడిగితే ఇప్పటికీ చెబుతారు శోభన్ బాబు అని. ఐతే ఆయన మన మధ్య లేకున్నా ఆయన జ్ఞాపకాలు మాత్రం అలాగే ఉండిపోయాయి.
తాను ఎక్కడ మొదలు పెట్టానో అక్కడే పూర్తిచేస్తానని అనుకున్న శోభన్ బాబు సినిమాల్లో హీరోగా కెరీర్ ప్రారంభించి చివరి వరకు హీరోగానే చేసి ఇండస్ట్రీ నుంచి తప్పుకున్నారు. చిత్ర పరిశ్రమలోకి ఎందరో హీరోలు, టెక్నీషియన్లు తమ వారసులను తీసుకొచ్చారు. కానీ శోభన్ బాబు మాత్రం తన వారసులను పరిచయం లేదు. కనీసం తన ఫ్యామిలీ గురించి ఎటువంటి విషయాలను ఇతరులతో పంచుకోలేదు. ఆ కాలంలో రాజా రవీంద్ర శోభన్ బాబును ఇదే ప్రశ్న అడిగాడట. దానికి ఆయన ఏం సమాధానం చెప్పాడో తెలుసా…
మిగతా పరిశ్రమలో కంటే సినీ ఇండస్ట్రీలో వారసులు ఎక్కువ. ఇప్పుడున్న వాళ్లలో దాదాపు ఏదో ఒక బంధం నుంచి వచ్చిన వారే. కొందరు హీరోలు తమ వారసులను తీసుకురాగా  మరికొందరు తమ్ముళ్లను, ఇతరులను తీసుకొచ్చారు. కానీ శోభన్ బాబు మాత్రం అందుకు విరుద్ధం. ఆయన సినిమాల్లో హీరోగా ఎన్నో సినిమాలు చేశారు. నటుడిగా ఆయనకు వచ్చిన గుర్తింపు ఆషామాషీ కాదు. ఆయన తలుచుకుంటే తన కుమారుడిని హీరోగా నిలబెట్టగలరు. కానీ అస్సలు తన కుమారుల గురించి చిత్ర పరిశ్రమకు పరిచయం చేయలేదు.
ఈ విషయంపై నటుడు రాజారవీంద్ర అప్పట్లో శోభన్ బాబును ఇదే ప్రశ్న వేశాడట. ఎందరో హీరోలు తమ కుమారులను హీరోలుగా చేస్తున్నారు మీరు మాత్రం ఎందుకు మీ కుమారులను తీసుకురావడం లేదు? అని అడిగాడట. తాను సినీ ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఎంతో ఒత్తిడికి గురయ్యాను. ఈ ఒత్తిడి నా కుమారులకు ఉండద్దని కోరుకుంటున్నా  అందుకే వారు సినిమాల్లోకి రావాలని ఉత్సాహం చూపించినా.. వ్యతిరేకించా అని చెప్పాడట. ఈ విషయాన్ని రాజా రవీంద్ర తాజాగా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
ఇక హీరోగానే కెరీర్ మొదలుపెట్టి ఆ తరువాత చివరి సినిమా హీరోగానే చేసిన తప్పుకుంటానని ముందే చెప్పిన శోభన్ బాబు అలాగే చేశారు. అయితే సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నంత కాలం శోభన్ బాబు డబ్బును బాగా పొదుపు చేశారు. ఆ డబ్బుతో చెన్నైలో భూములను కొనుగోలు చేశారు. ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఇండస్ట్రీలోనే ఆ కాలంలో అందరికంటే ధనవంతుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన స్ఫూర్తితోనే తాను కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు మురళీ మోహన్ అప్పుడప్పుడూ చెబుతూ ఉంటారు.
ఏదేమైనా శోభన్ బాబు లాంటి స్టార్ ఈ రోజుల్లో అరుదుగా ఉంటారు.ఒకటి క్యారెక్టర్ పరంగా మరియు ఆర్ధికంగా సంపాదించింది దాచుకోవడం కూడా ఒకరకమైన ఆర్ట్ అనే చెప్పాలి అని అంటున్నారు ఆయన అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: