SSMB28: రికార్డులు క్రియేట్ చేస్తున్న సూపర్ స్టార్?

Purushottham Vinay
'అతడు', 'ఖలేజా' లాంటి కల్ట్ క్లాసిక్ సినిమాల తర్వాత... సుమారు పదమూడు ఏళ్ళ  తర్వాత టాలీవుడ్ టాప్ హీరో మహేష్ బాబు,  త్రివిక్రమ్ శ్రీనివాస్ మూడవ సినిమా చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఈ సినిమా షూటింగ్ గురించి అనౌన్స్ చేశారు. ఒక చిన్న షెడ్యూల్ కూడా చేశారు.అయితే, పూర్తి స్థాయిలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసింది మాత్రం ఈ సంవత్సరంలోనే . ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ తో జరుగుతోంది. ఏప్రిల్ నెలాఖరుకు పాటలు ఇంకా ఒక ఫైట్ మినహా మిగతా టాకీ పార్ట్ అంతా కంప్లీట్ చేసేలా స్పీడ్ గా షూటింగ్ చేస్తున్నారట. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ పక్కా ప్లానింగుతో ముందుకు వెళ్తున్నారు.ఈ మధ్య కాలంలో నాలుగు నెలల్లో సూపర్ స్టార్ మహేష్ సినిమా పూర్తైన దాఖలాలు లేవు.


గతంలో కేవలం పూరి జగన్నాథ్ ఒక్కడే 'బిజినెస్ మేన్' సినిమాను ఫాస్ట్ గా తీశారు.ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్నట్లు ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్ కొన్ని రోజుల క్రితం వెల్లడించింది.ఈ సినిమా థియేట్రికల్ విడుదల తర్వాత తెలుగు, హిందీ, తమిళ, మలయాళ ఇంకా అలాగే కన్నడ భాషల్లో సినిమాను తమ ఓటీటీ వేదికలో విడుదల చేయనున్నట్లు తెలిపింది. దాంతో ఇది పాన్ ఇండియా సినిమా అనే ఓ క్లారిటీ కూడా వచ్చింది. ఓటీటీ రైట్స్ మొత్తం 80 కోట్ల రూపాయలు పలికినట్లు సమాచారం తెలిసింది. ఇక హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ సినిమాని నిర్మిస్తున్నారు.ఇక 'మహర్షి' లాంటి సూపర్ హిట్ తర్వాత మరోసారి మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో మరో హీరోయిన్ గా శ్రీలీల కూడా నటిస్తుంది. ఈ సినిమాకి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: