సుహాస్ "రైటర్ పద్మభూషణ్" మూవీ "ఓటిటి" విడుదల తేదీ వచ్చేసింది..!

Pulgam Srinivas
ఈ మధ్య కాలంలో వరుస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తున్న యువ నటులలో ఒకరు అయినటు వంటి సుహాస్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరియర్ ప్రారంభంలో ఎన్నో చిన్న సినిమాలలో చిన్న చిన్న పాత్రలో నటించిన సుహాస్ కొంత కాలం క్రితం కలర్ ఫోటో అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ థియేటర్ లలో కాకుండా నేరుగా ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది.

ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. అలాగే ఈ మూవీ లో సుహస్ నటనకు గాను మంచి ప్రశంసలు లభించాయి. ఈ మూవీ తో సుహాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ తర్వాత ఈ యువ నటుడు కి తెలుగు సినిమా ఇండస్ట్రీnలో అనేక అవకాశాలు లభించాయి. అందులో భాగంగా ఇప్పటికే ఎన్నో మూవీ లలో నటించిన సుహాస్ తన నటన తో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. కొంత కాలం క్రితమే సుహాస్ "హిట్ ది సెకండ్ కేస్" అనే మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు.
 

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ యువ హీరో రైటర్ పద్మభూషణ్ అనే మూవీ లో హీరోగా నటించాడు. షణ్ముఖ ప్రశాంత్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ని ఈ సంవత్సరం ఫిబ్రవరి 3 వ తేదీన థియేటర్ లలో విడుదల చేశారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ "ఓ టి టి" విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ మూవీ ని జీ 5 "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ మార్చి 17 వ తేదీ నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: