మళ్ళీ బింబిసార వైపు అడుగులు వేస్తున్న కళ్యాణ్ రామ్ !

Seetha Sailaja
నందమూరి కళ్యాణ్ రామ్ మూడు డిఫరెంట్ పాత్రలలో చాల కష్టపడి నటించిన ‘అమిగోస్’ భయకంరమైన ఫ్లాప్ గా మారడంతో మళ్ళీ అతడిని ఫ్లాప్ లు పలకరించడం మొదలైంది. దీనితో ఈ ట్రెండ్ కు చెక్ పెట్టాలని తనకు పేరు డబ్బు తెచ్చిపెట్టిన ‘బింబిసార’ మూవీకి సీక్వెల్ పై కళ్యాణ్ రామ్ దృష్టి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ సీక్వెల్ కు తనకు హిట్ ఇచ్చిన దర్శకుడు వశిష్ట స్థానంలో మరో యంగ్ డైరెక్టర్ రాబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాలలో గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. ఇలా కళ్యాణ్ రామ్ ఆలోచనలు మారడానికి దర్శకుడు వశిష్టకు కళ్యాణ్ రామ్ కు వచ్చిన చిన్నపాటి అభిప్రాయ భేదాలు ని అంటున్నారు. ‘బింబిసార’ సీక్వెల్ కథ విషయమై కళ్యాణ్ రామ్ ఆలోచనలు ఒకవిధంగా ఉంటే దర్శకుడు వశిష్ట ఆలోచనలు మరొక విధంగా ఉండటంతో వీరిద్దరి మధ్య ఈ అభిప్రాయ భేదాలు ఏర్పడి ఉంటాయి అన్న అంచనాలు ఉన్నాయి.

అయితే ఈవిషయమై మరికొందరు మరొక విధంగా ఊహాగానాలు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వశిష్ట సూపర్ స్టార్ రజనీకాంత్ ను కలిసి అతడికి ఒక కథను చెప్పినట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. అంతేకాదు ఈమధ్య ఇతడు బాలకృష్ణను కూడ కలిసినట్లు తెలుస్తోంది. ఎప్పటి నుండో బాలకృష్ణ చంఘిస్ ఖాన్ జీవితం పై ఒక సినిమా చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

దీనికి సంబంధించి వశిష్ట బాలయ్యకు ఏమైనా కథ రాస్తున్నాడా అన్న ఊహాగానాలు కూడ వచ్చాయి. దీనితో ఈ దర్శకుడు ఈసారి తీయబోయే తన మూవీ కళ్యాణ్ రామ్ లాంటి మీడియం రేంజ్ హీరోలతో కాకుండా ఒక బడా హీరోతో ఉంటుందా అన్న సందేహాలు కూడ వస్తున్నాయి. ఇండస్ట్రీలో సీక్వెల్స్ తీస్తున్నప్పుడు దర్శకుడుని మార్చడం అన్న ట్రెండ్ కొనసాగుతోంది. ‘డిజే టిల్లు’ సీక్వెల్ విషయంలో కూడ ఇలాగే జరిగింది. ఇప్పుడు కళ్యాణ్ రామ్ ఆ ట్రెండ్ ను అనుసరిస్తున్నాడు అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: