నన్ను దారుణంగా వాడుకొని మోసం చేసాడు అంటూ షాకింగ్ నిజాన్ని బయటపెట్టిన శ్రీముఖి..!?

Anilkumar
బుల్లితెరపై ప్రస్తుతం టాప్ యాంకర్ గా కొనసాగుతోంది శ్రీముఖి. పటాస్ షో ద్వారా బుల్లితెరకు పరిచయమైన ఈమె దాని అనంతరం సినిమాల్లో సైతం అవకాశాలను దక్కించుకుంటూ దూసుకుపోతుంది .ముఖ్యమైన పాత్రల్లో నటిస్తూ మంచి గుర్తింపును తెచ్చుకుంది ఈమె. వరుసగా సినిమాలలో అవకాశాలు రావడంతో తన అందంపై కూడా బాగా దృష్టి పెట్టి మరింత అందంగా తయారయింది శ్రీముఖి. దీంతో తనకి సినిమా అవకాశాలు కూడా ఎక్కువయ్యాయి. అలా సినిమా అవకాశాలతో పాటు బిగ్ బాస్ అనే ఒక రియాల్టీ షోలో కూడా పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుంది ఈమె. ఈ షో తో మరింత గుర్తింపును తెచ్చుకున్న శ్రీముఖి కోట్లాదిమంది తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది .

ఇక అలా కెరియర్లో పిక్ స్టేజ్ ని ఎంజాయ్ చేస్తున్న శ్రీముఖి ఇటీవల పాల్గొన్న కొన్ని ఇంటర్వ్యూలలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఇందులో భాగంగానే ముఖ్యంగా శ్రీముఖి తన పెళ్లి మీద వస్తున్న వార్తలపై స్పందించింది. తనకి పెళ్లి మీద ఏర్పడిన అభిప్రాయం వెనుక ఉన్న కథ గురించి కూడా చెప్పుకు వచ్చింది శ్రీముఖి. ఈ క్రమంలోనే పెళ్లెప్పుడు చేసుకుంటారు అని అడగగా ఊహించిన సమాధానాన్ని ఇచ్చింది శ్రీముఖి. ఇందులో భాగంగానే తను మాట్లాడుతూ గతంలో నేను ఒక అబ్బాయిని ఎంతో ఘాఢంగా ప్రేమించాను అని... అతని నా లోకం అనుకున్నాను అని.. కానీ అతను మాత్రం నా వ్యక్తిగత విషయాలను ఉన్న ప్రైవేటు ఫోటోలను లీక్ చేసి నా పరువు తీశాడు అని చెప్పుకొచ్చింది శ్రీముఖి.

ఆ విషయం తెలిసిన తర్వాత నేను ఎంతో బాధపడ్డాను.. అలాంటి వాడిని ప్రేమించినందుకు చాలా బాధపడ్డాను అంటూ చెప్పుకొచ్చింది శ్రీముఖి. ఆ సంఘటన తర్వాత నుండి తనకు ప్రేమ మీద పెళ్లి మీద విరక్తి పుట్టింది అంటూ చెప్పుకొచ్చింది శ్రీముఖి. ఈ క్రమంలోనే శ్రీముఖిని ఇంత దారుణంగా మోసం చేసిన ఆ దుర్మార్గుడు ఎవరు అంటూ అందరూ ఆరా తీయడం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలోనే అతను సినీ ఇండస్ట్రీకి చెందిన వాడా లేదా తన ఫ్రెండా అన్న కోణంలో కూడా శ్రీముఖి అభిమానులు ఆరాతీస్తున్నారు .ఇదిలా ఉంటే ఇక గతంలో శ్రీముఖి ఒక ప్రముఖ యాంకర్ తో ప్రేమలో ఉంది అన్న వార్తలు సైతం వినిపించాయి. ఈ నేపథ్యంలోనే ఆ ప్రముఖ యాంకర్ శ్రీముఖిని మోసం చేసి ఉంటాడా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: