"సూర్య 42" ఆ రేంజ్ లో ఉండబోతుందా..?

Pulgam Srinivas
తమిళ మరియు తెలుగు సినిమా ఇండస్ట్రీ లలో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న హీరోలలో ఒకరు అయినటు వంటి సూర్య గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదట తమిళ మూవీ ల ద్వారా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న సూర్య ఆ తర్వాత తాను నటించిన సినిమాలను తెలుగు లో విడుదల చేసి అనేక విజయాలను టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు.

ఇది ఇలా ఉంటే మొదట సూర్య ... మురగదాస్ దర్శకత్వంలో రూపొందిన గజిని మూవీ తో అద్భుతమైన విజయాన్ని తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందుకొని ... ఆ తర్వాత నుండి తాను నటించిన ప్రతి మూవీ ని తెలుగు లో విడుదల చేస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ను సూర్య సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సూర్య ... శివ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ సూర్య కెరియర్ లో 42 వ మూవీ గా రూపొందుతుంది.

దిశా పటాని ఈ సినిమాలో సూర్య సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని సూర్య కెరియర్ లో ఇప్పటి వరకు ఏ మూవీ ని నిర్మించనంత భారీ బడ్జెట్ తో అత్యంత గ్రాండ్ గా రూపొందిస్తున్నారు. ఈ మూవీ ని పాన్ ఇండియా మూవీ గా చిత్రీకరిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ఊహకు మించి ఉండబోతున్నట్లు ఈ మూవీ లో యాక్షన్స్ సన్ని వేషాలు ... పాటల చిత్రీకరణ అన్ని కూడా చాలా గ్రాండ్ గా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ కోసం భారీ బడ్జెట్ ను కూడా ఈ మూవీ యూనిట్ కేటాయించినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: