నా కుమారుడికి మొదటగా ఆ మూవీ నే చూపిస్తాను... కాజల్ అగర్వాల్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటీ మణులలో ఒకరు అయినటు వంటి కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కాజల్ ఎప్పటికీ తెలుగు , తమిళ , హిందీ భాషల సినిమాలలో నటించి దేశ వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును ఏర్పరచుకుంది. ఇది ఇలా ఉంటే లక్ష్మీ కళ్యాణం మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఆ తర్వాత చందమామ ... మగధీర లాంటి వరుస విజయాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా మారిపోయింది.

ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగింది. కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మాత్రమే కాకుండా కాజల్ తమిళ సినిమా ఇండస్ట్రీ లో కూడా చాలా సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించింది. అలాగే కొన్ని హిందీ మూవీ లలో కూడా నటించి అక్కడి ప్రేక్షకుల మనసులను కూడా దోచుకుంది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే కాజల్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే ఒక పండంటి మగ బిడ్డకు జన్మను కూడా ఇచ్చింది.

ఈ ముద్దుగుమ్మ ఒక బిడ్డకు జన్మను ఇచ్చిన తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ ఫుల్ క్రేజీ సినిమా అవకాశాలను దక్కించుకుంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా కాజల్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. తన కుమారుడు నీల్ కి 8 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు మూవీ లకు దూరంగా ... అలానే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేవి అందించకుండా పెంచాలనుకుంటున్నట్లు కాజల్ తెలిపింది. అలానే అతడికి తొలి సారిగా విజయ్ హీరోగా తాను నటించిన తుపాకీ మూవీ ని చూపించాలనుకుంటున్నట్లు కాజల్ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: