"మామ మశ్చీంద్ర" మూవీ నుండి సుధీర్ మూడవ లుక్ విడుదల..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్న యువ హీరోలలో ఒకరు అయినటు వంటి సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ హీరో ఇప్పటికే అనేక తెలుగు మూవీ లలో హీరో గా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ హీరో పోయిన సంవత్సరం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అని మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేక పోయింది. ఆ తర్వాత ఈ హీరో హంట్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ సినిమా మంచి అంచనాలు నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరాశపరిచింది. ఇలా వరుస అపజయాలతో డీలా పడిపోయి ఉన్నా సుదీర్ ప్రస్తుతం మామ మశ్చీంద్ర అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో సుధీర్ సరసన ఈషా రెబ్బ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... హర్ష వర్ధన్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు.
 

ఈ మూవీ లో సుధీర్ మూడు విభిన్న పాత్రలలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం రెండు పాత్రలకు సంబంధించిన పేరు మరియు పోస్టర్ లను విడుదల చేయగా ... తాజాగా ఈ మూవీ లోని మూడవ పాత్ర మరియు పేరు కు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ లోని మూడవ పాత్ర డీజే ను పరిచయం చేస్తూ ఈ చిత్ర బృందం ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఈ మూవీ తో సుదీర్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: