మరో సీనియర్ హీరోతో మూవీ ప్లాన్ చేస్తున్న బాబి..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి టాలెంట్ కలిగిన యువ దర్శకుల్లో ఒకరు అయినటు వంటి బాబి గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రవితేజ హీరో గా హన్సిక హీరోయిన్ గా రూపొందిన పవర్ మూవీ తో దర్శకుడుగా కెరియర్ ను మొదలు పెట్టిన బాబి ఆ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ ... జై లవకుశ ... వెంకీ మామ మూవీ లకు దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ దర్శకుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా రూపొందిన వాల్తేరు వీరయ్య అనే సినిమాకు దర్శకత్వం వహించాడు.

ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల అయిన ఈ మూవీ భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఈ మూవీ తో బాబి క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అమాంతం పెరిగి పోయింది. ఇలా వాల్టేర్ వీరయ్య మూవీ తో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న ఈ దర్శకుడు తన తదుపరి మూవీ  ఏ హీరో తో ఉంటుందా అని సినీ జనం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా అందుకు సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. బాబి ప్రస్తుతం నందమూరి నట సింహం బాలకృష్ణ తో ఒక మూవీ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు ... అందులో భాగంగా బాలకృష్ణ కోసం ఒక అదిరిపోయే మాస్ పవర్ఫుల్ కథను సిద్ధం చేసుకుంటున్నట్లు ... ఈ కథ మొత్తం పూర్తి కాగానే బాలకృష్ణ కు ఆ కథ ను వినిపించడానికి బాబి సిద్ధం అవుతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలబడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: