ఫ్యాన్స్ కి తెలీకుండా.. రహస్యంగా ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కినా స్టార్స్!

praveen
సినిమా ఇండస్ట్రీలో చాలా రోజులుగా రిలేషన్స్ లో ఉన్న జంటలు ఈ ఏడాది ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు గ తేడాది వికీ కౌశల్ - కత్రినా కైఫ్ అలాగే అలియా భట్ - రన్బీర్ సింగ్ తో పాటు మరికొంతమంది టీవీ నటులు బాలీవుడ్ స్టార్స్ పెళ్లి చేసుకోగా ఈ ఏడాది కూడా ప్రారంభం నుంచి చాలామంది పెళ్లి పీటలు ఎక్కుతున్నారు దీంట్లో కొంతమంది రహస్యంగా వివాహం చేసుకుంటుంటే కొంతమంది పబ్లిక్ గా అనౌన్స్ చేస్తున్నారు. ఇక ఈ ఏడాది ప్రారంభంలోనే కియారా అద్వానీ వివాహం సిద్ధార్థ మల్హోత్రాలతో జరగదా మరికొంతమంది స్టార్ సెలబ్రిటీస్ రహస్యంగా పెళ్లి పెళ్లి పీటలు ఎక్కారు. మరి వారెవరో చూద్దాం.
స్వర భాస్కర్
ఎల్లప్పుడూ ఏదో ఒక విషయంలో వార్తల్లో ఉండే వ్యక్తి స్వర భాస్కర్ ఆమె పెళ్లి విషయం కూడా సంచలనంగా చేసింది జనవరి 6 వ తేదీన సమాజ్వాది పార్టీ నేత అహ్మద్ తో ఆమె రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని ఆ విషయాన్ని ఒక నెల రోజుల తర్వాత ఒక షార్ట్ వీడియో రూపంలో అభిమానులకు చెప్పింది.
మాన్వి గాగ్రు - వరుణ్
బాలీవుడ్ యాక్టర్ మాన్వి కమెడియన్ అయినా వరుణ్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. అసలు వీరి పెళ్లి విషయం అత్యంత గోప్యంగా ఉంచడమే కాదు ఎలాంటి రూమర్ కూడా మీడియాకి చిక్కలేదు. అతి తక్కువ బంధుమిత్రుల సమక్షంలో వీధి ఎంగేజ్మెంట్ జరిగింది. ఫిబ్రవరి 23న పెళ్లి బంధంతో ఒకటయ్యారు.
చిత్రాసి రావత్
బాలీవుడ్ నటి చిత్రాశి రావత్ గుట్టు చప్పుడు కాకుండా వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ అయినా ధ్రువాదిత్యతో మూడుముళ్ల బంధంతో ఫిబ్రవరి 4 న ఒకటైంది.
దేవలీన భట్టాచార్జి  
కోడలా కోడలా కొడుకు పెళ్ళామా వంటి డబ్బింగ్ సీరియల్ తో తెలుగు వారికి పరిచయమైన నటి దేవాలీన గత ఏడాది డిసెబర్ లో రహస్యంగా పెళ్లి చేసుకుంది.

కీర్తిదా మిస్త్రీ
ఫిబ్రవరి 23 న బాలీవుడ్ యాక్ట్రెస్ కీర్తిదా మిస్త్రీ తన్ బాయ్ ఫ్రెండ్ రిబ్బు మెహ్రా ను రహస్యంగా వివాహం చేసుకుంది. చాలా లెట్ గా ఈ విషయం బయటకు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: