ప్రియాంక చోప్రా కొత్త వెబ్ సిరీస్ ఆ తేదీ నుండి ప్రసారం..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికుల పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ లలో నటించి ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ గుర్తింపును సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ప్రియాంక చోప్రా కొంత కాలం క్రితం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందిన జంజీర్ అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది.

ఈ మూవీ తెలుగు లో తుఫాన్ అనే పేరుతో విడుదల అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించక పోయినప్పటికీ ఈ మూవీ ద్వారా ప్రియాంక చోప్రా మాత్రం తెలుగు సినీ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపును దక్కించుకుంది. ఈ మూవీ లు మాత్రమే కాకుండా ప్రియాంక చోప్రా నటించిన అనేక మూవీ లు కూడా తెలుగు లో విడుదల అయ్యి మంచి ప్రేక్షకు ఆదరణ పొందాయి. ఇది ఇలా ఉంటే సినిమా లతో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ తాజాగా సిటడేల్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ వెబ్ సిరీస్ విడుదలకు సిద్ధం అయ్యింది.

ఈ వెబ్ సిరీస్ లో ప్రియాంక చోప్రా తో కలిసి రీచార్జ్ మ్యాడెన్ నటించాడు. ఈ మూవీ ని హాలీవుడ్ నిర్మాతలు రీచార్జ్ రుస్సో ... ఆందోనీ రస్సో స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ గా రూపొందించారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి. తాజాగా ఈ వెబ్ సిరీస్ యూనిట్ ఈ వెబ్ సిరీస్ ను ఏప్రిల్ 28 వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇంగ్లీష్ , తెలుగు , హిందీ , తమిళ్ , కన్నడ , మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మరి ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: