"దసరా" మూవీ "యూఎస్ఏ" హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!

Pulgam Srinivas
నాచురల్ స్టార్ నాని ఆఖరుగా అంటే సుందరానికి అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నాని "దసరా" అనే పక్కా మాస్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా సంతోష్ నారాయణ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు.

ఈ మూవీ ని మార్చి 30 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి 2 పాటలను మరియు ఈ సినిమాకు సంబంధించిన ఒక ప్రోమో సాంగ్ ను ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ సాంగ్ లకు ప్రేక్షకుల నుండి ప్రస్తుతం సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని యుఎస్ఏ లో కూడా ఈ చిత్ర బృందం అదిరిపోయే రేంజ్ లో విడుదల చేయడానికి ఏర్పాటు చేస్తుంది.
 

ఈ మూవీ యొక్క యూఎస్ఏ హక్కులను ప్రత్యాంగిరా సంస్థ దక్కించుకుంది. ఈ సంస్థ ఈ మూవీ ని యూఎస్ఏ విడుదల చేయనున్నట్లు తాజాగా అధికారికంగా ప్రకటించింది. అలాగే ఈ మూవీ యొక్క యూఎస్ఏ బుకింగ్ లను మార్చి 14 వ తేదీన ఓపెన్ చేయనున్నట్లు ... ఈ మూవీ ప్రీమియర్స్ ను మార్చి 29 వ తేదీ నుండి యుఎస్ఎలో ప్రసారం చేయనున్నట్లు ఈ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ సంస్థ విడుదల చేసిన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: