కస్టడీ సినిమాతో వీరిద్దరి కెరియర్ మారెనా..?

Divya
అక్కినేని కుటుంబ సభ్యులకు గత ఏడాది పెద్దగా కలిసి రాలేదని చెప్పవచ్చు .వరుసగా సినిమాలన్నీ ఫ్లాప్ అవుతూనే ఉన్నాయి.అక్కినేని నాగచైతన్య నటించిన తాజా చిత్రం కస్టడీ. ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకులలో మంచి బజ్ ఏర్పడింది. ఈ సినిమాను తమిళ డైరెక్టర్ వెంకట ప్రభు దర్శకత్వం వహిస్తూ ఉన్నారు.. కాఫ్ డ్రామా చిత్రంగా ఈ సినిమాని తెరకెక్కించడం జరుగుతోందట. ఈ చిత్రంలో చైతన్య ఒక పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్ ఈ సినిమా పైన భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి. ఇటీవల ఈ సినిమా షూటింగ్ కూడా ముగించుకున్న చిత్ర బృందం ఈ సినిమాను త్వరలోనే రిలీజ్ చేయడానికి కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి డబ్బింగ్ పనులను కూడా మొదలుపెట్టారు హీరో నాగ చైతన్య ఈమెరకు సోషల్ మీడియాలో పోస్ట్ ను కూడా షేర్ చేయడం జరిగింది చిత్ర బృందం. త్వరలోనే ఈ సినిమా వర్కింగ్ అంతా ముగించుకొని ప్రమోషన్ పనులను ప్రారంభించాలని తెలియజేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తున్నది. అలాగే విలక్షణమైన నటుడు అరవిందస్వామి ఈ చిత్రంలో విలన్ గా కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. మే 12వ తేదీన ఈ సినిమాని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

ఇక ఈ సినిమా అటు నాగచైతన్య కెరియర్ను కృతి శెట్టి కెరియర్ను ఏ మేరకు సక్సెస్ బాట పట్టేలా చేస్తుందో చూడాలి మరి. గడిచిన చిత్రాలు అన్ని కృతి శెట్టి వరుస ప్లాపులతో సతమతమవుతున్నాయి ఇక నాగచైతన్య కూడా థాంక్యూ సినిమాకు ఘోరమైన పరాజయాన్ని మూటకట్టుకున్నారు. దీంతో వీరందరి కెరియర్ కూడా ఈ సినిమా పైన ఆధారపడి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: