షారుక్ ఖాన్ "పఠాన్" మూవీ "ఓటిటి" విడుదల అప్పుడేనా..?

Pulgam Srinivas
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ గత కొంత కాలంగా వరుస అపజయాలతో డీలా పడిపోయిన విషయం మన అందరికీ తెలిసిందే. అలా వరుస అపజాలతో డీల పడిపోయిన షారుక్ గత కొంత కాలం సినిమాలకు కూడా దూరంగా ఉన్నాడు. అలా కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న షారుక్ ప్రస్తుతం మాత్రం వరుస మూవీ లను ఓకే చేస్తూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు. ఇది ఇలా అంటే చాలా సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్న షారుఖ్ తాజాగా యువ దర్శకుడు సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ పఠాన్ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ మూవీ లో షారుక్ సరసన దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించగా ... జాన్ అబ్రహం ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మంచి టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు లభిస్తున్నాయి.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న పఠాన్ మూవీ "ఓ టి టి" విడుదలకు సంబంధించిన ఒక న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకున్నట్లు ... అందులో భాగంగా ఈ మూవీ ని ఏప్రిల్ చివరి వారం నుండి అమెజాన్ సంస్థ తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఒక వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: