"ఇండియన్ 2" లేటెస్ట్ షూటింగ్ అప్డేట్..!

Pulgam Srinivas
లోక నాయకుడు కమల్ హాసన్ పోయిన సంవత్సరం లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన విక్రమ్ మూవీ తో ప్రేక్షకులను పలకరించి అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇలా విక్రమ్ మూవీ తో సూపర్ సక్సెస్ ను అందుకున్న కమల్ హాసన్ ప్రస్తుతం ఇండియా గర్వించ దగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటు వంటి శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇండియన్ 2 అనే మూవీ లో హీరో'గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఇప్పటికే ఇండియన్ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఇండియన్ 2 మూవీ పై ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇలా భారీ అంచనాలు కలిగి ఉన్న ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ ... రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితమే స్టార్ట్ అయినప్పటికీ మధ్యలో కొన్ని రోజుల పాటు ఈ మూవీ షూటింగ్ ఆగి పోయింది. తిరిగి కొంత కాలం క్రితమే ఈ మూవీ షూటింగ్ మళ్లీ ప్రారంభం అయింది. ఇది ఇలా ఉండే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది.

ప్రస్తుతం ఈ మూవీ యొక్క నైట్ షెడ్యూల్ షూటింగ్ ను ఈ చిత్ర  బృందం చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ చిత్రీకరిస్తున్న నైట్ సీక్వెన్సెస్ ఈ మూవీ కే హైలెట్ గా నిలవనున్నట్లు సమాచారం. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క మొత్తం షూటింగ్ ను జూలై నెల వరకు పూర్తి చేయనున్నట్లు ... ఆ తర్వాత అతి తక్కువ రోజుల్లోనే ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం దీపావళి పండగ సందర్భంగా విడుదల చేసే ఆలోచనలు ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: