తన ఆపరేషన్ పై స్పందించిన నబా నటేష్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ నబా నటేశ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . నన్ను దోచుకుందువటే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ ముద్దు గుమ్మ ఈస్మార్ట్ శంకర్ మూవీ తో అదిరి పోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని  తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ను సంపాదించు కుంది . ఆ తర్వాత ఈ ముద్దు గుమ్మకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అదిరిపోయే క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు కూడా లభించాయి .

అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మ అల్లుడు అదుర్స్ ... మాస్ట్రో వంటి సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించింది . ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ సూపర్ క్రేజీ ను సంపాదించు కొని వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటున్న సమయం లోనే ఈ ముద్దు గుమ్మకు యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ కారణంగా అనేక సినిమా అవకాశాలను కోల్పోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా తన యక్సిడెంట్ కారణంగా తనకు జరిగిన ఆపరేషన్ ల గురించి ఈ ముద్దు గుమ్మ తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందించింది.

ఆ రోడ్డు ప్రమాదం తనకు అనేక సినిమా అవకాశాలను దూరం చేసిందని నబా వెల్లడించింది. అయితే ఆరోగ్యంగా ఉండడం ముఖ్యమని భావించానని , అందు కోసమే ఆ విషయం గురించి బాధ పడడం లేదని ఈ ముద్దు గుమ్మ తెలిపింది.  తాను బతుకుతానని అనుకోలేదని, భుజం ఎముక విరిగిందని , అనేక ఆపరేషన్ లు కూడా చేశారని వివరించింది. ఇలా సోషల్ మీడియా వేదికగా తాజాగా నబా నటేశ్ తనుకు జరిగిన యాక్సిడెంట్ మరియు ఆపరేషన్ ల గురించి చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: