ఆ సినిమా షూటింగ్లో అమితాబ్ బచ్చన్ కు గాయాలు..!

frame ఆ సినిమా షూటింగ్లో అమితాబ్ బచ్చన్ కు గాయాలు..!

Pulgam Srinivas
బిగ్ బి అమితాబచ్చన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అమితాబచ్చన్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీలలో హీరోగా నటించి బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే అమితాబచ్చన్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా హీరో పాత్రలో కాకుండా సినిమాల్లో అతి ముఖ్యమైన పాత్రలో నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే ఎన్నో సినిమాల్లో అతి ముఖ్యమైన పాత్రలో నటించిన అమితాబ్ తన నటన తో ఎన్నో సినిమాల విజయాలలో కీలక పాత్రను పోషించాడు.

ఇది ఇలా ఉంటే అమితా బచ్చన్ ఇప్పటికే ఎన్నో తెలుగు మూవీ లలో కూడా కీలకమైన పాత్రలో నటించాడు. అందులో భాగంగా కొంత కాలం క్రితమే అమితా బచ్చన్ ... మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయన తార ... తమన్నా హీరోయిన్ లుగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందినటు వంటి సైరా నరసింహా రెడ్డి అనే భారీ బడ్జెట్ ప్లాన్ ఇండియా మూవీ లో చిరంజీవి గురువు పాత్రలో నటించాడు. ఈ సినిమాలో అమితా బచ్చన్ పాత్రకు సూపర్ ప్రశంసలు దక్కాయి.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అమితా బచ్చన్ ... ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనే హీరోయిన్ గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ మూవీ ప్రాజెక్ట్ కే సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఇటీవల ఈ మూవీ షూటింగ్ లో పాల్గొన్న అమితా బచ్చన్ కు గాయాలు అయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో జరిగిన షూటింగ్ లో అమితా బచ్చన్ కు గాయాలు అయినట్లు ... హైదరాబాద్ లో ట్రీట్మెంట్ తీసుకొని ప్రస్తుతం ముంబై లో రెస్ట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: