పింక్ కలర్ డ్రెస్ లో మైమరపిస్తున్న ఐశ్వర్య రాజేష్..!

Pulgam Srinivas
అద్భుతమైన టాలెంట్ ఉన్న నటి మనులలో ఒకరు అయినటు వంటి ఐశ్వర్య రాజేష్ గురించే ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ సినిమాల ద్వారా కెరియర్ ను మొదలు పెట్టిన ఈ మోస్ట్ బ్యూటిఫుల్ నటి తమిళ సినిమా ఇండస్ట్రీ లో నటిగా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ముద్దుగుమ్మ కౌసల్య కృష్ణమూర్తి అనే క్రికెట్ నేపథ్యంలో రూపొందిన సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది.
 

ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆలరించ లేక పోయినప్పటికీ ఈ మూవీ లోని ఐశ్వర్య నటన కు మాత్రం తెలుగు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి. అలా నటి గా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే అనేక తెలుగు మూవీ లలో నటించి తన నటితో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది.
 

ఇలా నటిగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే తనకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ వస్తుంది. ఐశ్వర్య ఎక్కువ శాతం తన సోషల్ మీడియాలో ట్రెడిషనల్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా కూడా ఐశ్వర్య సోషల్ మీడియాలో అదిరిపోయే ట్రెడిషనల్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఐశ్వర్య తాజాగా పింక్ కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని అదిరిపోయే క్లాస్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఐశ్వర్య కు సంబంధించిన ఈ క్లాస్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: