శర్వానంద్ కొత్త సినిమా అప్డేట్ ఈరోజు ఆ సమయానికి..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం మంచి గుర్తింపు కలిగిన యువ హీరోలలో ఒకరు అయినటు వంటి శర్వానంద్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ యువ హీరో కెరియర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలలో నటించి తన నటన తో ఎంతో మంది ప్రేక్షకుల మరియు విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. అలా చిన్న చిన్న పాత్రలతో కెరియర్ ను మొదలు పెట్టిన శర్వానంద్ ఆ తర్వాత హీరో గా అవకాశాలను దక్కించుకొని ఇప్పటికే హీరో గా ఎన్నో విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రస్తుతం మంచి క్రేజ్ ఉన్న హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే శర్వానంద్ ఆఖరుగా ఒకే ఒక జీవితం అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రీతు వర్మ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. అక్కినేని అమల ఈ మూవీలో శర్వానంద్ కు తల్లి పాత్రలో నటించింది. ఈ మూవీ లో అమల నటనకు గాను ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. ఈ మూవీ ద్వారా చాలా రోజుల తర్వాత శర్వానంద్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకున్నాడు. ఒకే ఒక జీవితం మూవీ లో వెన్నెల కిషోర్ ... ప్రియదర్శి ముఖ్యమైన పాత్రలలో నటించారు.

ఇది ఇలా ఉంటే ఒకే ఒక జీవితం విజయంతో మళ్ళీ తిరిగి ఫామ్ లోకి వచ్చిన శర్వానంద్ ప్రస్తుతం వరుస సినిమాలను ఓకే చేస్తూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు. అందులో భాగంగా శర్వానంద్ తన కెరీర్ లో 35 వ సినిమాను కూడా ఇప్పటికే ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన వివరాలను ఈ రోజు ఉదయం 9 గంటలకు ఈ మూవీ యూనిట్ విడుదల చేయబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: