మంచు మనోజ్ బలప్రదర్శన పై ఆసక్తికర చర్చలు !

Seetha Sailaja
మంచు మనోజ్ మౌనిక ల వివాహం మంచు లక్ష్మీ ఇంటిలో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. వీరి పెళ్ళికి సంబంధించిన ఫోటోలు మీడియాలో అత్యంత ప్రముఖంగా కనిపించాయి. సాధారణంగా ఎంతటి గొప్ప ఫిలిం సెలెబ్రెటీ పెళ్ళి అయినా ఇక్కడితో సరిపోతుంది. అయితే మంచు మనోజ్ మౌనిక లు మరో అడుగు ముందుకు వేసి వారి పెళ్ళి తరువాత వారిద్దరూ మౌనిక సొంత ఊరు అయిన ఆళ్ళగడ్డకు భారీగా కార్ల ర్యాలీతో వెళ్ళడమే కాకుండా దారిపొడుగునా వారికి లభించిన ఘన స్వాగతం పరిశీలించిన వారికి ఈ జంటలో ఎవరో ఒకరు రానున్న ఎన్నికలలో పోటీ చేయడం ఖాయం అన్న సంకేతాలు వస్తున్నాయి.

వాస్తవానికి మౌనిక సోదరి అఖిల ప్రియ ఇప్పటికే రాజకీయాలలో ఉంది. ఆమె గతంలో మంత్రిగా కూడ పనిచేసింది. దీనితో మౌనిక రాజకీయాలలోకి వస్తే ఆమె కూడ తన సోదరి ఉన్న పార్టీలోనే చేరుతుందా లేదంటే వేరే రాజకీయ పార్టీలో చేరుతుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. మౌనిక చాల అనర్గళంగా ఏవిషయం పైన అయినా మాట్లాడుతుంది అన్నకామెంట్స్ ఉన్నాయి.

మంచు మనోజ్ కు కూడ రాజకీయాల పై ఆశక్తి ఉంది. హీరోగా అతడి కెరియర్ పెద్దగా బాగుండక పోవడంతో ఆమధ్య హైదరాబాద్ కు దగ్గరలో ఒక టూరిజం స్పాట్ ను అభివృద్ధి చేయడానికి మనోజ్ చాల పరిశోధన చేసాడు అని కూడ అంటారు. అయితే ఆ ప్రాజెక్ట్ ఏమైందో తెలియదు. అదేవిధంగా తిరుపతి దగ్గర ప్రాంతాలలో మంచు మనోజ్ ఒక రియలెస్టేట్ వెంచర్ వేస్తాడు అని కూడ కొంతకాలం క్రితం వార్తలు వచ్చాయి కానీ అదికూడ జరగలేదు.

ఇప్పుడు మనోజ్ పెళ్ళి చేసుకుని కొంతవరకు సెటిల్ అయ్యాడు కాబట్టి అతడి కెరియర్ మళ్ళీ ఏదోవిధంగా ఊపు అందుకుంటుందని అతడి అభిమానులు భావిస్తున్నారు. తండ్రి లానే చాల ఆవేశంగా మాట్లాడే తన స్వభావం రీత్యా రాజకీయాలకు బాగా సరిపోతాడు. దీనితో రానున్న ఎన్నికలలో మంచు మనోజ్ రంగప్రవేశం ఖాయం అన్న కామెంట్స్ కూడ ఉన్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: